మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే సందడి ఇప్పటి నుంచే షురూ చేశారు ఫ్యాన్స్. భారీ వేడుకలకు మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. సన్నాహాలకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు.
మెగా స్టార్ తనయుడు మెగా పవర్ స్టార్.. బర్త్ డే అంటే ఫ్యాన్స్ కు పండగే. ఈ పండగ కోసం ఏడాదంతా వెయిట్ చేసే మెగా ఫ్యాన్స్ వారం ముందు నుంచే సందడి మొదలు పెడతారు. అయితే ఈసారి కరోనా వల్ల బర్త్ డే వేడుకలకు రెండేళ్లు గ్యాప్ రావడంతో రెండు వారాల ముందు నుంచే సందడి మొదలెట్టేశారు. ఈ సారి తగ్గేదేలే అంటున్నారు అభిమానులు.
మార్చి 27న రామ్ చరణ్ (Ram Charan) తన 36వ బర్త్ డే జరుపుకోనున్నారు. దీనికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు ఫ్యాన్స్ వేడుకలకు దూరంగా ఉన్నారు. కోవిడ్ ఆంక్షలు అమలులో ఉండడంతో పాటు ఫ్యాన్స్ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వేడుకలు నిర్వహించవద్దని, గుంపులుగా సామూహిక కార్యక్రమాలు నిర్వహించవద్దని రామ్ చరణ్(Ram Charan)చెప్పడంతో వేడుకలు చేయలేకపోయారు.
రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే కు సంబంధించి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు టీమ్. గెడ్ రెడీ ఫర్ మెగా మాసీవ్ ఫెస్టివల్ (Get Ready for Mega Massive Festival) అంటూ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ మాసీవ్ ఫెస్టివల్ ను 27 మార్చి సాయంత్ర 4.30 కు జరపబోతున్నట్టు వీడియోలో ప్రకటించారు. రెండు సంవత్సరాల తర్వాత రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు ఎటువంటి ఆంక్షలు లేకుండా జరుపుకునే అవకాశం ఫ్యాన్స్ కి దక్కింది.
రామ్ చరణ్ స్టైలీష్ లుక్ తో ఉన్న వీడియో తో పాటు..చరణ్ సినిమాల్లో మాసీవ్ స్టైలీష్ వీడియోస్ తో స్పెషల్ మాంటేజ్ ను రిలీజ్ చేశారు టీమ్. ఒక వైపు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భర్త్ డేకు చరణ్ నిం ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతోంది. దీనితో పాటు శంకర్ సినిమా నుంచి అలాగే ఆచార్య నుంచి కూడా చరణ్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. శంకర్ డైరెక్షన్ లో చరణ్ చేస్తోన్న RC15 మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు సమాచారం.
