Asianet News TeluguAsianet News Telugu

నాటు నాటు ఆస్కార్ విజయం.. ఢిల్లీ వీధుల్లో రచ్చ రచ్చ చేసిన జర్మనీ ఎంబసీ, బాబోయ్ ఇది ఊర మాసు

ఆస్కార్ గెలిచిన తర్వాత కూడా నాటు నాటు సాంగ్ వేడి చల్లారడం లేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 95వ అకాడమీ అవార్డ్స్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అవార్డు గెలుచుకుని రాజమౌళి, కీరవాణి, రాంచరణ్,, ఎన్టీఆర్, ఇతర ఆర్ఆర్ఆర్ టీం ఇండియాకి తిరిగొచ్చేశారు కూడా.

germany embassy staff celebrates Naatu Naatu Song Oscar
Author
First Published Mar 19, 2023, 10:13 AM IST

ఆస్కార్ గెలిచిన తర్వాత కూడా నాటు నాటు సాంగ్ వేడి చల్లారడం లేదు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 95వ అకాడమీ అవార్డ్స్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అవార్డు గెలుచుకుని రాజమౌళి, కీరవాణి, రాంచరణ్,, ఎన్టీఆర్, ఇతర ఆర్ఆర్ఆర్ టీం ఇండియాకి తిరిగొచ్చేశారు కూడా. కానీ ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు వైబ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. 

ఇండియాకి ఆస్కార్ తెచ్చిన రాజమౌళిపై, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నాటు నాటు సాంగ్ కి కీరవాణి స్వరపరిచిన బీట్, చంద్రబోస్ అందించిన అచ్చతెలుగు సాహిత్యం.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గాత్రం.. ముఖ్యంగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ ట్రెండ్ కావడంలో ఈ అంశాలన్నీ బాగా కుదిరాయి. ఆ ఫలితంగానే లేడీగాగా, రియానా లాంటి దిగ్గజాల పాటలని దాటుకుని నాటు నాటు ఆస్కార్ గెలిచింది. 

నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో విదేశీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాలో ఉన్న ఇతర దేశాల ఎంబసీ సిబ్బంది కూడా నాటు నాటు పాట ఆస్కార్ విజయాన్ని ఒక పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా జర్మనీ ఎంబసీ సిబ్బంది నాటు నాటు ఆస్కార్ విజయాన్ని తమదైన శైలిలో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద అదిరిపోయేలా డ్యాన్స్ చేసారు. జర్మనీ ఎంబసీ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ డ్యాన్స్ వీడియో చేశారు. ఈ వీడియో చూస్తే ఇండియాలో వారు ఎంత బాగా కలసిపోయారో అర్థం అవుతోంది. అచ్చతెలుగు పాట భావం తెలియనప్పటికీ.. ఆ పాటలో బీట్ వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అని చెప్పడం లో సందేహం లేదు. 

అంతకు ముందు నాటు నాటు సాంగ్ ట్రిబ్యూట్ గా సౌత్ కొరియా ఎంబసీ సిబ్బంది కూడా డ్యాన్స్ వీడియో చేశారు. వారి ఇన్సిపిరేషన్ తోనే తాము కూడా ఈ వీడియో చేసినట్లు జర్మనీ ఎంబసీ పేర్కొంది. 'జర్మన్స్ డ్యాన్స్ చేయలేరా ? నేను నా సిబ్బంది కలసి నాటు నాటు ఆస్కార్ విజయాన్ని ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాం. ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే మా డ్యాన్స్ చాలా బ్యాడ్ గా ఉంది. కానీ ఎంతో ఎంజాయ్ చేసాం. మమ్మల్ని ఇన్స్ పైర్ చేసిన కొరియన్ ఎంబసీకి థ్యాంక్స్. ఇండియాకి తిరిగొచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకి స్వాగతం. నాటు నాటు పాటపై ఇప్పుడు ఎంబసీ ఛాలెంజ్ ఓపెన్ .. నెక్స్ట్ ఎవరు ? అంటూ జర్మనీ ఎంబసీ చీఫ్ ఫిలిప్ అకేర్మాన్ ట్వీట్ చేశారు. 

జర్మనీ ఎంబసీ సిబ్బంది ఢిల్లీ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వస్తారు. అక్కడ నాటు నాటు సాంగ్ వినగానే వారిలో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. నాటు నాటు సాంగ్ ప్రాంతాలకు, మతాలకు అతీతంగా ఎంత పాపులర్ అయిందో ఈ వీడియోలో చూపించారు.  ఢిల్లీ వీధుల్లో జర్మనీ సిబ్బంది ఇలా డ్యాన్స్ చేస్తుంటే జనాలు ఎగబడి మరీ చూశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అలాగే కొరియన్ సిబ్బంది చేసిన డ్యాన్స్ వీడియో కూడా ట్రెండింగ్ లో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios