Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లో బూతు పురాణం, నీయబ్బ.. నీ.. అంటూ రెచ్చిపోయిన కంటెస్టెంట్స్, ఏడ్చేసిన గీతు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రచ్చ రచ్చ జరుగుతోంది. అసలైన గేమ్స్ ను ఇప్పుడు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. హౌస్ లో గేమ్ రసవత్తరంగా  సాగుతుంది. ఎవరికి వారు తామే గెలవాలన్న పట్టుదలతో కొట్టుకు చస్తున్నారు. అంతే కాదు బూతు పురాణం కూడా విప్పుతున్నారు. 
 

Geetu Crying In Bigg Boss Telugu Season 6
Author
First Published Oct 25, 2022, 11:37 PM IST

బిగ్ బాస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్స్ కు సంబంధించి చాలా సీరియస్ గా గేమ్ నడుస్తోంది. ఎవరికి వారు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. ప్రతీ సారి డల్ గా ఉండే కీర్తి కూడా.. ఈసారి తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యింది. అన్నిటికు ముందుండే గీతూ మాత్రం టాస్క్ లో అందరికంటే వెనకబడింది. ఇక ఇనయా, రేవంత్ జంటగా రెచ్చిపోయి గేమ్ ఆడారు. రెండు సార్లు వారే విన్నర్స్ గా నిలిచారు. 


చేపల గేమ్ విషయంలో వాటిని కాపాడుకోవడం., ఇంకొకరి దగ్గర నుంచి లాక్కోవడం, మరో వైపు చేపలను కలెక్ట్ చేసుకోవడం ఇలా చాలా టఫ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలో హౌస్ లో ఉన్నవారంతా తమ శక్తికి మించి ఈ ఆటను ఆడే ప్రయత్నం చేశారు. అడులో కోపాలు, కోట్లాటతో పాటు మాట తూలడం కూడా వినిపించింది. గీతూ నీయబ్బ అన్న మాటను ఉపయోగించడం చర్చనీయాంశం అయ్యింది. అయితే తన స్లాంగ్ వల్ల అలా అనిపించింది కాని తాను కావాలని ఆ మాట  అనలేదంటూ మరో కన్వింస్సింగ్ సమాధానం వినిపించింది. 

మరో వైపు రేవంత నీ అమ్మ అంటూ అన్నాడన్న మాట్ కూడా హౌస్ లో చర్చకు దార తీసింది. అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. గేమ్ విషయంలో మాత్రం ఎవరి చేపలు వారు కాపాడుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. అంత కష్టపడ్డా.. గీతూ,ఆది బుట్టలోనే చాలాతక్కువ చేపలు ఉండటంతో.. గీతూ బోరున ఏడ్చింది. గీతూకు,రోహిత్,మెరీనాకు మధ్య జరిగిన గొడవను  గుర్తు చేస్తూ.. తాను కావాలనే రెచ్చగొట్టానని.. అది గేమ్ కోసమే అంటూ గీత తెగ బాధపడింది 

హౌస్ లోకి వచ్చిన ఈ ఏడువారాలలో గీతూ ఎడ్వడం ఎవరూ చూడలేదు. ఇప్పుడేంటి ఇలా ఏడుస్తున్నావ్ అంటూ అందరూ గీతూను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇ ఆతరువాత బండి నెట్టే టాస్క్ లో రాజ్ కు రేవంత్ కు మధ్య వాగ్వాదం జరిగింది. అటు బాలాదిత్య- శ్రీ సత్య మధ్య కూడా కాస్త మాటల యుద్దం జరిగింది. బండి నెట్టే టాస్క్ లో శ్రీహాన్ టీమ్ ఒక సారి, రాజ్-ఫైమా టీమ్ ఒక సారి గెలిచారు. ఈ విషయంలో సంచాలక్ గా ఉన్న సూర్యపై రేవంత్ తో పాటు ఇనయా కూడా ఫైర్ అయ్యింది. 

మొత్తానికి ఈరోజు టాస్క్ కంప్లీట్ అయ్యింది. ఇదే టాస్క్  రేపు కూడా కంటీన్యూ అవుతుంటూ బగ్ బాస్ అనౌస్స్ చేశాడు. ఇప్పటికే ఆదిరెడ్డి, గీతూ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. మరి ఈవారు కెప్టెన్ ఎవరు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది. ఇక అటు శ్రీ సత్య ఎప్పుడూ లేని విధంగా హౌస్ లో కాస్త హాట్ గా కనిపించింది. క్లీవేజ్ షో చేస్తోంది. స్లీవ్ లెస్ గా కనిపించి షాక్ ఇచ్చింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios