Asianet News TeluguAsianet News Telugu

ఒక్క చేపతో గేమ్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న గీతు, రేవంత్, శ్రీహాన్ లకు షాక్ , ఇనయా సవాల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రస్తుతం 8 వారం రసవత్తరంగా నడుస్తోంది. ఈ వారంలోనే ఎవరి నిజస్వరూపాలు ఏంటో తెలిశాయి.  ఒక్కోక్కరు స్నేహ దర్మాన్ని పక్కన పెట్టి మరీ గేమ్ ను ఆడేస్తున్నారు. ఎవరుఎంత ఆడినా.. చివరిగా గేమ్ స్వరూపాన్నిమార్చేసింది గీతు 
 

Geethu Change the Game with single Fish in big boss
Author
First Published Oct 26, 2022, 11:41 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతుంది గత మూడు రోజులుగా చేపల టాస్క్ కోసం ఇంట్లో ప్రతీ ఒక్కరు కష్టపడుతున్నారు. ఈక్రమంలో ఒకరిపై మరొకరు మాట తూలడం కామన్ గాజరుగుతూనే ఉంది. ఎవరికి వారు చేపలు సాధించడానికి,, ఒకరి చేపలు మరొకరు దొంగతనం చేయడానికి తెగ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి స్టామినా ఎంతో తెలిసింది. ముఖ్యంగా బాలాదిత్య శ్రీహాన్ -శ్రీసత్యలను వదలకుండా వెంటాడి మరీ వారిస్కోర్ తగ్గించే ప్రయత్నం చేశాడు. అటు సంచాలక్ గా గీతూ కొత్త రూల్స్ పెడుతూ... అందరిచేత చీవాట్లుతిన్నది. ముఖ్యంగా ఆదిరెడ్డితో కూడా చీవాట్లు తిన్నది గీతు.

 ఈక్రమంలో సంచాలక్ అయినా సరే తను కూడా చేపలు తీసుకుంటుండటంతో అందరూ రకరకాల మాటలు అన్నారు. ముఖ్యంగా రేవంత్ ఆమెపై ఫైర్ అయ్యాడు. ఈక్రమంలోనే ఒకరిపై ఓకరు ఆరోపణలు, కొట్లాటలు..ఇలా జరుగుతున్న సందర్భంలోనే గీతూ ఒక్క సారగా గేమ్ అంతటిని మార్చేసి.. అందరికి షాక్ ఇచ్చింది. అది కూడా కామ్ గా చేసింది. దాంతో ఆట అంతా గీతూ వైపు టర్న్ అయ్యింది గేమ్ ఆడినవారి చేపలు ఫైనల్ లెక్క చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. లెక్క పెట్టిన గీతూ.. రేవంత్, టీమ్ , రాజ్ టీమ్ ఆతరువాత శ్రీహాన్ టీమ్ కు ఎక్కువగా చేపులు వచ్చాయి. బాలాధిత్య టీమ్ చివరి పొజిషన్ లో ఉన్నారు అని చెప్పారు. 

వెంటనే బిగ్ బాస్ ఇంట్లోకి నల్ల చేప వచ్చింది ఎక్కడ ఉంది అనగా అది గీతూ తీసుకువచ్చి చూపించి ఈ చేపతో రెండు టీమ్స్ న స్వైప్ చేయబచ్చని బిగ్ బాస్ చెప్పగా.. గీతూ.. రేవంత్- శ్రీహాన్ లను స్వీప్ చేస్తున్నట్టు గీతూ ప్రకటించింది. ఇంతటో ఆట ముగిసినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. అయితే ఈలోపు ఇనయా ఆటను కొనసాగించాలని.. తామేంటో మళ్లీ నిరూపిస్తామంటూ ఛాలెంజ్ చేసింది. ఇక అంతకు మందు ఆట నుంచి క్విట్ అయిన గీతూ... రేవంత్ దగ్గర చేపలను తీసుకోవాలి అని చాలా ట్రై చేసింది. కాని తెల్లవార్లు ప్రయత్నంచేసినా.. అది సాగనివ్వలేదు రేవంత్. చాలా జాగ్రత్తగ గేమ్ ఆడుతూ వచ్చాడు. 

ఇటు గీతూ మెరీనాలు కూడా కాసేపు ఘాటుగా వాదులాడుకున్నారు. ఈమధ్యలో పెట్టిన చిన్న టాస్క్ లో సూర్య-వాసంతి విన్ అయ్యారు. ఇక లంచ్ టైమ్ లో ఒకరిపై మరొకరు గుసగుసలాడుకోవడం గట్టిగానే చర్చించుకోవడం జరిగిపోయింది. ఈ గేమ్ ఇంతటితో ముగిసింది. రేపు ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూడాలి. అంతే కాదు ఈసారి ఎవరు హౌస్ కెప్టెన్ అవుతారా అని అంతా ఉత్కంటగా ఎదురు చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios