ఇదివరకే విజయ్ అర్జున్ రెడ్డిని సొంతం చేసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు గీత గోవిందంను కూడా హిందీలో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

2018 లో అతి తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాన్ని అందించినక్ చిత్రాల్లో గీత గోవిందం టాప్ లో ఉందని చెప్పాలి. విజయ్ దేవరకొండ - రష్మిక మందాన నటించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఎప్పటిలానే ఈ సినిమాపై కూడా బాలీవుడ్ ప్రముఖుల కన్ను పడింది. 

ఇదివరకే విజయ్ అర్జున్ రెడ్డిని సొంతం చేసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఇప్పుడు గీత గోవిందంను కూడా హిందీలో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక హీరోగా విజయ్ చేసిన పాత్రను ఇషాన్ ఖతార్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన ధఢఖ్ సినిమాతో బాలీవుడ్ కి ఈ కుర్ర హీరో పరిచయమయ్యాడు. 

అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఆ సినిమా అనంతరం కొన్ని ప్రాజెక్ట్ లపై చర్చలు బాగానే జరిపాడు. ఓ ప్రముఖ దర్శకుడితో ఇషాన్ కలవనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా గీత గోవిందం రీమేక్ తో మరోసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇషాన్ సిద్ధమయినట్లు టాక్.