టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ.. పరశురామ్ దర్శకత్వంలో నటించిన 'గీత గోవిందం' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందనే విషయాన్ని చెప్పనక్కర్లేదు. వంద కోట్ల షేర్ వసూలు చేసిన చిన్న చిత్రంగా నిలిచిపోయింది.

అప్పటివరకు విజయ్ దేవరకొండకి యూత్ లో మాత్రమే ఫాలోయింగ్ ఉండేది. కానీ 'గీత గోవిందం'తో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా క్రేజ్ సంపాదించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దర్శకుడు పరశురామ్ తో మరో సినిమా చేయాలనుకుంటున్న విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' కి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందని అడిగారట. దానికి పరశురామ్ కూడా అంగీకరించడంతో కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి విజయ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

దీంతో పరశురామ్ ముందుగా మరోహీరోతో సినిమాను పూర్తి చేసి ఆ తరువాత విజయ్ కాల్షీట్స్ ని బట్టి 'గీత గోవిందం' సీక్వెల్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో రష్మికనే రిపీట్ చేస్తారా లేక మరో హీరోయిన్ ని తీసుకుంటారో చూడాలి!