మెగా హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 31వ పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, బంధుమిత్రులు, సినీ సెలెబ్స్, ‘గని’ మూవీ టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆయన అప్ కమింగ్ మూవీ నుంచి గ్లిమ్స్ ను వదిలారు.
మెగా ప్రిన్స్, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ జాబితాలో ఒకరిగా చేరిన వరుణ్ తేజ్ ‘ముకుంద’ మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి వరుస సినిమాల్లో కొత్తగా కనిపిస్తూ తన అభిమానుల్లో జోష్ పెంచుతున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
రెగ్యూలర్ కమర్షియల్ సినిమాల్లోనే వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంటున్నాడు ఈ మెగా హీరో.
అదే జోష్ లో భిన్నమైన స్టోరీ తో తెరకెక్కుతున్న ‘గని’ మూవీతో వరుణ్ తేజ్ ట్రెండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో తన పుట్టిన రోజు సందర్భంగా ‘గని’ టీం ఆయనకు ప్రత్యేక విషేష్ తెలియజేసింది. మూవీ నుంచి వరుణ్ ఎనర్జీని చూపే గ్లిమ్స్ ను ఈ రోజులు ‘గీతా ఆర్ట్స్’ విడదల చేసింది. ఈ గ్లిమ్స్ కు మంచి స్పందన వస్తోంది.
అయితే ఇది వరకే ఈ మూవీ నుంచి వదిలిన టీజర్, స్పెషల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వరుణ్ తేజ్ పుట్టి రోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ గ్లిమ్స్ విడుదల చేస్తూ వరుణ్ కు బర్త్ డే విషేష్ తెలిపింది. అంతేకాకుండా ‘ప్రతి సినిమాల్లో కొత్తరకం పాత్రల్లో నటిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకోసం ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ గా నిలవనుందని ఆశిస్తున్నాం’. అంటూ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.
అంతేకాకుండా తన అభిమానులు కూడా తనకు విషేష్ తెలియజేస్తూ ‘స్పెషల్ వీడియో’లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘గని’తో గట్టిగా కొట్టాలని కోరుతున్నారు. అటు బంధువులు గనికి విషేష్ తెలియజస్తున్నారు. కాగా గని నుంచి విడుదలైన టీజర్, స్పెషల్ సాంగ్ లో తమన్న ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు పెద్ద ఎత్తున్న ఆశలు పెంచుకుంటున్నారు. ప్రస్తుతం రిలీజైన గ్లిమ్స్ మాత్రం వెరీ అంగ్రీనెస్, రోమాలు నిక్కబొడిచే మ్యూజిక్ ఉండటం అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ సినిమాతో ఈసారి వరుణ్ తేజ్ అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.
