గీత గోవిందం ట్విట్టర్ రివ్యూ

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 15, Aug 2018, 8:56 AM IST
geeta govindam twitter review is here
Highlights

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లీకేజీ సమస్యతో బయటకు వచ్చిన రెండు సీన్లు కూడా బాగుండటంతో.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

‘ అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. ఇక తెలుగులో ఛలో సినిమాతో తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది రష్మిక మందన్న. వీరిద్దరి కాంబినేషన్ లో డెరెక్టర్ పరశురాం తెరకెక్కించిన చిత్రం ‘ గీతా గోవిందం’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు (ఆగస్టు 15న) ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు వచ్చింది. 

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. లీకేజీ సమస్యతో బయటకు వచ్చిన రెండు సీన్లు కూడా బాగుండటంతో.. సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా వీరిద్దరి జంట కూడా సినిమా పోస్టర్లలో చూడటానికి బాగుండటంతో.. ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే కొందరు ఈ సినిమాని వీక్షించగా.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

వారి ట్వీట్ల ప్రకారం.. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్‌మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ.. చిత్రానికి మరో ప్లస్ అని చెబుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది.  పూర్తి రివ్యూ రావాలంటే.. మరికొంత సేపు ఆగాల్సిందే.

loader