“గౌతమిపుత్ర శాతకర్ణి” ‘బాహుబలి’ని మించి పోతుందా? ట్రయలర్ విడుదలయ్యాక అంతా అనుకుంటున్నది ఇదే మేకింగ్ లో ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించినట్టు స్పష్టం చేస్తున్న ట్రైలర్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రయలర్ లాంచ్ అయిపోయింది. ఇప్పటికే బాలకృష్ణ వందో చిత్రం కావటంతో యమా క్రేజ్ సాధించిన ఈ మూవీ ట్రయలర్ విడుదల తర్వాత అమాంతం అంచనాలు పెంచేస్తోంది. క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.

గౌతమిపుత్ర శాతకర్ణి ట్రయలర్ కు అనూహ్య స్పందన రావడం, చూసిన వారంతా అద్భుతం అని ప్రశంసలు కురిపించడం కామనైపోయింది. అయితే ఈ ప్రశంసలు కురిపిస్తున్న వారిలో బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న కూడా ఉన్నాడు. దర్శకుడు రాజమౌళి సైతం క్రిష్ మేకింగ్ పట్ల ఫిదా అయిపోయాడు. ఎనిమిది నెలల్లోనే అద్భుతం చేశావంటూ క్రిష్ ను రాజమౌళి ప్రశంసించాడు.

ఏకంగా రాజమౌళి కూడా క్రిష్ కు ప్రశంసలు కురిపిస్తున్నాడంటే గౌతమిపుత్రలో ఎంత స్టామినా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళితో పాటు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా క్రిష్ కు అభినందనలు తెలిపాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. క్రిష్ తెరకెక్కించిన గౌతమిపుత్ర శాతకర్ణిలో మేటర్ ఎంతుందో.

ట్రయలర్ చూసిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు తొలుస్తునన్న ప్రశ్న ఒక్కటే. అదే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తుందా అని. క్రిష్ ను ఎంత పొగడ్తల్లో ముంచెత్తినా... జక్కన్న తనదైన స్థాయి నిలుపుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తన చిత్రం బాహుబలితో పోలిస్తే మిని అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.

నిజానికి ఈ ట్రయలర్ చూసిన వాళ్లందరికీ షాకింగ్ అనిపిస్తున్నది ఒకే అంశం. అదే.. కేవలం ఎనిమిది నెలల్లో ఇంత అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారా అని. చిత్రీకరణ మాత్రమే కాదు ట్రయలర్లో వినిపించిన డైలాగ్స్ వింటుంటేనే రోమాలు నిలబడుతున్న ఫీలింగ్. మరి థియేటర్ లో ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అనిపిస్తోంది. ఇంతటి అద్భుతాన్నని ఆవిష్కరించిన క్రిష్ కు అభినందనలు తెలపాల్సిందే. మరి ఈ చిత్రం బాహుబలి రికార్డులను తిరగ రాస్తుందా అనేది ప్రస్థుతానికి వెయిట్ చేయాల్సిన అంశం.