ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కథ నచ్చితే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ టైగర్ యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'మళ్లీరావా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన గౌతం తిన్ననూరి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. తాజాగా నానితో 'జెర్సీ' సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. గౌతం పనితనం నచ్చిన హీరోలు అతడితో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ బడా నిర్మాత ఎన్టీఆర్, గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో సినిమా సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. గౌతం కూడా ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. కథ రెడీ అవ్వగానే ఎన్టీఆర్ ని కలిసి వినిపించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'RRR'సినిమాతో బిజీగా గడుపుతున్నాడు.

ఆ తరువాత మరే ప్రాజెక్ట్ సైన్ చేయలేదు. గౌతం స్క్రిప్ట్ గనుక నచ్చితే అతడితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ ని మెప్పించే స్క్రిప్ట్ గౌతం సిద్ధం చేస్తాడేమో చూడాలి!