గౌతమ్ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు. ఈ బర్త్ డే తన సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్ చేసుకున్నారు. తాత సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంని మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని గురువారం తన పుట్టిన రోజు(17)ని జరుపుకున్నారు. మహేష్‌బాబు, నమ్రత తనయుడికి గొప్పగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా వారుపెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే గౌతమ్ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు. ఈ బర్త్ డే తన సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్ చేసుకున్నారు. తాత సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంని మహేష్‌బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఆ ఊరిలో అన్నిరకాల వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఊరు అభివృద్ధితోపాటు స్కూల్‌ని కూడా అభివృద్ధి చేశారు. మంచి ఎడ్యూకేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు ఊరికోసం ఎంతో కొంత సాయం చేస్తుంది మహేష్ ఫ్యామిలీ. ఇటీవల సితార బుర్రిపాలెంలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఊరు విద్యార్థినీలకు సైకిళ్లని పంపిణి చేసింది. ఇప్పుడు గౌతమ్ కూడా పిల్లలకు తనవంతు సాయాన్ని అందించి సర్‌ప్రైజ్ చేశాడు.
గౌతమ్ బుర్రిపాలెంలో తన 17వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. వారి మధ్య కేక్ కట్ చేసి వారికి తినిపించాడు. అనంతరం పిల్లలకు వారికీ స్పోర్ట్స్ కిట్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు హియరింగ్ మెషిన్ కూడా అందజేశాడు. ఎంబీ ఫౌండేషన్ సారథ్యంలో ఆశ్రయకృతి స్వచ్చంద సంస్థకి చెందిన పిల్లలకు ఈ మిషన్లని అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇటు తల్లి నమ్రత, అటు గౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన బర్త్ డే ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ గౌతమ్ పేర్కొన్నాడు. తనకుమారుడు ఇలాంటి మంచి పనిచేయడం పట్ల నమ్రత సంతోషాన్ని వ్యక్తం చేసింది. గర్వంగా ఉందంటూ ఆమె పేర్కొంది.
