Asianet News TeluguAsianet News Telugu

అమితాబ్ కే ఎసరు పెట్టిన గంగూలీ.. కేబీసీలో కేటీఆర్ ప్రస్తావన, ఆ ప్రశ్నకు దాదా ,వీరూ బోల్తా

బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)'షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొని డబ్బు గెలుచుకుంటున్నారు. 

Ganguly and Sehwag attends Amitabh Bachchan KBC
Author
Hyderabad, First Published Sep 4, 2021, 12:54 PM IST

బిగ్ బి అమితాబ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి(కేబీసీ)'షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పాల్గొని డబ్బు గెలుచుకుంటున్నారు. ప్రస్తుతం కేబీసీ 13వ సీజన్ జరుగుతోంది. 

లేటెస్ట్ ఎపిసోడ్ కి టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో గంగూలీ, సెహ్వాగ్, అమితాబ్ మధ్య సరదాగా సంభాషణ జరిగింది. 

గంగూలీ, సెహ్వాగ్ ఈ షోలో రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. అమితాబ్ అడిగిన 50 లక్షల ప్రశ్నలకు దాదా, వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. దీనితో 25 లక్షల వద్దే వారి పోటీ ఆగిపోయింది. 

తాము గెలుచుకున్న రూ 25 లక్షల డబ్బుని సేవా కార్యక్రమాలకు విరాళం ఇస్తున్నట్లు వీరు, దాదా ప్రకటించడం విశేషం. ఈ షోలో ఓ ఫన్నీ సంఘటన కూడా జరిగింది. గంగూలీ కాసేపు అమితాబ్ ని హాట్ సీట్ లో కూర్చేబెట్టి కొన్ని ప్రశ్నలు అడిగాడు. దీనితో అమితాబ్.. చూస్తుంటే నా సీటుకే ఎసరు పెట్టేట్లు ఉన్నావు అం సరదాగా కామెంట్ చేశారు. 

దీనికి గంగూలీ బదులిస్తూ.. ఒకవేళ నేను కనుక ఈ షోకి హోస్ట్ గా చేయాల్సి వస్తే ముందు మీ వీడియోలు చూసే నేర్చుకుంటాను అని బదులిచ్చాడు. దాదా, వీరు సమాధానం చెప్పలేకపోయినా ప్రశ్న ఇదే.. ఆజాద్ హింద్ రేడియో సేవలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో మొదట ఏ దేశంలో మొదలయ్యాయి ?అని బిగ్ బి ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నకు జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. కానీ వీరూ, దాదా సమాధానం ఇవ్వలేకపోయారు. సరైన సమాధానం 'జర్మనీ'. ఇదే షోలో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రస్తావన కేబీసీలో వచ్చింది. 

అమితాబ్.. దాదా, వీరూ లకు మంత్రి కేటీఆర్ కు సంబంధించిన ప్రశ్న అడిగారు. 'పలకడానికి వీలుగా లేని కోవిడ్ 19 మెడిసిన్ లిస్ట్ పై కేటీఆర్ ఎవరికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు? అని అమితాబ్ అడిగారు. 

దీనికి దాదా, వీరూ.. శశి థరూర్ అని సరైన సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేటీఆర్ స్పందించారు. హిల్లేరియస్.. దాదా, వీరూ కరెక్ట్ గా సమాధానం చెప్పి ఉంటారని ఆశిస్తున్నాను అం ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios