Asianet News TeluguAsianet News Telugu

Gangster Gangaraju Movie Review: గ్యాంగ్ స్టర్ గంగరాజు రివ్యూ...

లక్ష్య్ హీరోగా దర్శకుడు ఇషాన్ సూర్య‌ తెరకెక్కించిన చిత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు. వలయం మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన లక్ష్య్ ఆకట్టుకున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ స్టర్ గంగరాజు జూన్ 24న విడుదలైంది. పోస్టర్స్, టైటిల్ తో అంచనాలు ఏర్పడగా గ్యాంగ్ స్టర్ గంగరాజు ఎంత మేర ఆకట్టుకుందో చూద్దాం.. 

gangster gangaraju movie review
Author
Hyderabad, First Published Jun 24, 2022, 8:35 PM IST

నటీనటులు : లక్ష్య్‌,  వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ:శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
దర్శకత్వం: ఇషాన్ సూర్య‌ 
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: క‌ణ్ణ పి.సి.
ఎడిటర్‌ :  అనుగోజు రేణుకా బాబు

కథ

దేవరలంకకు చెందిన గంగరాజు(లక్ష్య్‌) ఫ్రెండ్స్ తో ఊరిలో పనీపాట లేకుండా తిడుతూ ఉంటాడు. ఆవారా గాడైన గంగరాజు ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై ఉమాదేవి( వేదిక దత్త) ప్రేమలో పడతాడు.ఉమాదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి నానా వేషాలు వేస్తూ ఉంటాడు. అలా జాలీ లైఫ్ అనుభవిస్తున్న గంగరాజు దేవరలంకలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ సిద్దప్పని హత్య చేస్తాడు. పోరంబోకు గంగరాజు ఆ గ్యాంగ్ స్టర్ ని ఎందుకు చంపాడు? అతని చంపడం వలన గంగరాజు జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటీ? మరి ఎస్ఐ ఉమాదేవితో ప్రేమ వ్యవహారం ఏమైంది? అనేది మిగతా కథ.... 

విశ్లేషణ 
గ్యాంగ్ స్టర్ గంగరాజు ఓ విలేజ్ కామెడీ అండ్ లవ్ డ్రామా అని చెప్పవచ్చు. అయితే సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ అంశాలు కలగలిపి దర్శకుడు ఇషాన్ సూర్య తెరకెక్కించారు. ప్రధానంగా కామెడీ, లవ్ అంశాలతో నడిపిస్తూనే ఎమోషనల్, యాక్షన్ టచ్ ఇచ్చారు. మొదటి భాగం అంతా గంగరాజు ఎస్ఐ ఉమాదేవి లవ్ ట్రాక్ తో నడిపించాడు. ఉమాదేవిని ఇంప్రెస్ చేయడం కోసం గంగరాజు పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్, బామ్మ అన్నపూర్ణ ఫైట్ సీన్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు. 

ఇక సెకండ్ హాఫ్ లో గంగరాజు స్టోరీ మరో టర్న్ తీసుకుంటుంది. ప్రత్యర్థుల నుండి తప్పించుకోవడం కోసం గంగరాజు ట్రిక్స్, ప్లాన్స్ బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. సినిమా చాలా వరకు కన్విన్సింగ్ గా సాగుతుంది. గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్ర ముగింపు కూడా బాగానే ఉంది. అయితే ఇది రొటీన్ కథే. మనం ఇప్పటికే ఈ తరహా చిత్రాలు చాలా చేశాము. కామెడీ, లవ్, ఎమోషన్స్ వర్క్ అవుట్ కావడంతో మూవీ ఆహ్లాదంగా అలా సాగుతూ పోతుంది. 
హీరో లక్ష్య్‌ గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రాన్ని అన్నీ తానై నడిపాడు. విలేజ్ ఫెల్లో క్యారెక్టర్ లో అతడు సహజంగా అనిపించాడు. కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే ఫైట్స్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మొత్తంగా సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు.

ఎస్సై ఉమాదేవిగా వేదిక దత్త తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై చాలా అందంగా కనిపించింది. గంగరాజు తండ్రి నాగరాజు పాత్రలో గోపరాజు రమణ ఒదిగిపోయాడు. ఒక ఎమ్మెల్యే నర్సారెడ్డిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. బసిరెడ్డిగా చరణ్‌ దీప్‌ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిశోర్‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సాయి కార్తీక్‌ సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునేలా ఉంది. క‌ణ్ణ పి.సి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

 లక్స్య్ నటన
కామెడీ, 
లవ్ ట్రాక్ 
కథనం 

మైనస్ పాయింట్స్ 
రొటీన్ స్టోరీ 
సాంగ్స్ 

ఫైనల్ గా గ్యాంగ్ స్టర్ గంగరాజు టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు. రొటీన్ కథ అయినప్పటికీ కామెడీ, లవ్, ఎమోషనల్ అంశాలు ఆకట్టుకున్నాయి. దీంతో ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీకి మంచి సాంగ్స్ కూడా తోడైతే ఫలితం వేరేలా ఉండేది. 

రేటింగ్: 2.75/5 

Follow Us:
Download App:
  • android
  • ios