విశ్వక్ సేన్ నటించిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`కి మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఓపెనింగ్స్ మాత్రం డీసెంట్‌గానే ఉన్నాయి. ఫస్ట్ డే ఎంత వచ్చాయి, ఎంత వ్యాపారం జరిగిందనేది చూస్తే,
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ `గామి` వంటి ప్రయోగాత్మక మూవీ అనంతరం ఇప్పుడు `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` అనే మాస్ మూవీతో వచ్చారు. ఆయన నటించిన ఊరమాస్ మూవీ ఇది. యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. కృష్ణ చైతన్య రూట్ మార్చి ఈ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శుక్రవారం ఈ మూవీ విడుదలైంది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ఎప్పటిలాగే బుక్ మై షో, గూగుల్‌లో తక్కువ రేటింగ్ వచ్చిందని టీమ్ వాపోయింది. విశ్వక్ సేన్ నిన్న ప్రెస్‌మీట్‌లో తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు కావాలని తక్కువ రేటింగ్ వచ్చేలా ఓట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలో తాజాగా ఫస్డ్ డే కలెక్షన్ల రిపోర్ట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. నిజాంలో గట్టిగా వసూళు చేసింది. ఏకంగా కోటీ పది లక్షలు రాగా, వైజాగ్‌లో 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 28 లక్షలు, వెస్ట్ గోదావరి 24 లక్షలు, గుంటూరు 30 లక్షలు, నెల్లూరు 17 లక్షలు, సీడెడ్ 76 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా మూడు కోట్ల 32 లక్షల గ్రాస్ సాధించింది. కోటీన్నర షేర్ సాధించింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు. ఓవర్సీస్ కలుపుకుంటే నాలుగు కోట్లు దాటిందని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ మూవీకిది డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.
ఇక `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` బిజినెస్ లెక్కలు చూస్తే, ఈ మూవీ నైజాంలో మూడు కోట్లకు అమ్ముడు పోయింది. ఆంధ్రలో ఐదు కోట్లకు, సీడెడ్‌లో కోటీన్నరకు అమ్ముడు పోయింది. ఓవర్‌సీస్‌లో సుమారు రెండు కోట్లకు అమ్ముడు పోయిందట. ఇలా మొత్తంగా 12కోట్ల వరకు ఈ మూవీ వ్యాపారం జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 24కోట్ల గ్రాస్ రావాలి. మరి ఈ క్లిష్ట సమయంలో దాన్ని రీచ్ అవుతుందా అనేది డౌట్. ఎందుకంటే సినిమాకి నెగటివ్ టాక్ వినిపిస్తుంది. ఏం ఆడినా శని, ఆదివారమే, ఆ తర్వాత భారీగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. పైగా ఎన్నికల రిజల్ట్ హడావుడి కారణంగా జనాలు సినిమాలు చూసే మూడ్‌లో ఉండటం కష్టం. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.
