ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వను బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు షో నిర్వాహకులు. గంగవ్వ లాంటి ఓ సాధారణ వ్యక్తికి అవకాశం ఇవ్వడం అందరికి షోపై సదాభిప్రాయం కలిగించింది. ప్రాథమిక చదువు కూడా లేని గంగవ్వ తన మార్కు మాటలతో బాగానే సరదా పంచింది. ఐతే గంగవ్వకు కఠిన టాస్క్ ల విషయంలో మినహాయింపు ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఆరోగ్య కారణాల రీత్యా షోలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉన్నా మధ్యలో వచ్చేసింది. 

బిగ్ బాస్ తరువాత గంగవ్వ పాపులారిటీ మరింత పెరిగింది. పలు ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ బిగ్ బాస్ విశేషాలు అడిగి తెలుసుకుంటున్నారు. సొంతూరు వెళ్లిన గంగవ్వకు ఘన స్వాగతం లభించిందట. అలాగే తన కొడుకు, మనవళ్లను చూసికోని ఆమె మురిసిపోయిందట. గంగవ్వ మనవళ్లు మాత్రం షోలో ఇంకొన్నాళ్లు ఉండాల్సిందని అన్నారట. చాలా కాలం తరువాత వాళ్ళను కలవడం ఎంతో ఆనందం కలిగించిందని గంగవ్వ చెప్పారు. 

ఇక బిగ్ బాస్ హౌస్ సంగతులు కూడా గంగవ్వ చెప్పడంతో పాటు విన్నర్ అతనే అని తేల్చివేసింది. హౌస్ లో సరదాగా ఉండేది అవినాష్ అట. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే అవినాష్ అంటే ఇంటి సభ్యులలో అందరికీ ఇష్టమేనట. కాబట్టి  ఈ సీజన్ విన్నర్ అవినాష్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని గంగవ్వ జోస్యం చెప్పింది. ఇక నాగార్జున ఇచ్చిన ఇంటి హామీ నెరవేరనుందని గంగవ్వ ఆశాభావం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి గంగవ్వకు మెసేజ్ లు వస్తున్నాయట. హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత కూడా డాక్టర్స్ గంగవ్వ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారట.