బిగ్ బాస్ హౌస్ నుండి గంగవ్వ మొదటి బహుమతి అందుకుంది. నిన్న హౌస్ లో జరిగిన ఫ్యాషన్ షోలో ఆడవాళ్ళ కేటగిరీలో విన్నర్ గా నిలిచారు. గత ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ అంతా సరదా సరదాగా సాగింది. హౌస్ మేట్స్ కలర్ ఫుల్ గా తయారు కావడంతో పాటు, ఆసక్తికర ఈవెంట్స్ తో దుమ్మురేపారు. ముఖ్యంగా చందనా బ్రదర్స్ పంపిన సాంప్రదాయ దుస్తులు ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొనడం జరిగింది. ఆడవాళ్ళందరూ పట్టు శారీల్లో, సల్వార్ కమీజ్ లలో తయారయ్యారు.
 
ఇక ఫ్యాషన్ లో గెలిచిన విజేతలకు లక్ష రూపాయల బహుమతి అని బిగ్ బాస్ ప్రకటించడంతో మరింత ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మాయిల కేటగిరీలో ఈ ఫ్యాషన్ షో నందు గంగవ్వను ఏకగ్రీవం ఎన్నుకున్నారు. గంగవ్వను విజేత ప్రకటించడం జరిగింది. దీనితో బిగ్ బాస్ చెప్పిన లక్ష రూపాయల బహుమతి గంగవ్వ సొంతం అయ్యింది. హౌస్ లోకి వచ్చినాక బిగ్ బాస్ నుండి గంగవ్వ అందరికంటే మొదటి గిఫ్ట్ అనుకుంది. 

ఇక అబ్బాయిల కేటగిరీలో అవినాష్ ని విన్నర్ గా ప్రకటించారు. మొదట నోయెల్ అని ప్రకటించి తరువాత అవినాష్ అనడంతో లాస్య మరియు సుజాత మధ్య కొంచెం వివాదం నడిచింది. నిన్న ఎపిసోడ్ లో కూడా సందడి మొత్తం అవినాష్ దే. మెల్లగా అవినాష్ ప్రేక్షకులు మరియు హౌస్ మేట్స్ మనసులు దోచుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతున్నారు.