బిగ్ బాస్ హౌస్ లో సింపథీతో చాలా కాలం కొనసాగింది గంగవ్వ. ఆమె హౌస్ లో ఉంటే నాలుగు డబ్బులు సంపాదించుకుంటుందనే ఆలోచనతో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేసి కాపాడేవారు. గంగవ్వ పై ప్రేమ చూపడం ద్వారా ప్రేక్షకులలో మంచి అభిప్రాయం పొందవచ్చని మిగతా కంటెస్టెంట్స్ సైతం ఆమెపై ఆప్యాయత చూపించేవారు దీని వలన గేమ్ కూడా దెబ్బతినడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కారణాలు చూపించి గంగవ్వను ఇంటి నుండి బయటికి పంపారు. 

హౌస్ నుండి బయటికి వచ్చిన గంగవ్వ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. ఇంటి సభ్యుల ప్రవర్తన మరియు  అమ్మాయిలు అబ్బాయిల మధ్య కొనసాగే ప్రేమ వ్యవహారాలపై కూడా ఆమె స్పందించడం జరిగింది. ఇంటిలో గంగవ్వకు బాగా దగ్గిరైన అఖిల్ పై కూడా గంగవ్వ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అతడంటే తనకు ఇష్టం అంటూనే అఖిల్ తనతో పంచుకున్న కొన్ని విషయాలు ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 

అఖిల్ గతంలో ఓ హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడిపాడట. దాదాపు నాలుగేళ్లు వీరు ప్రేమించుకున్నారట. చివరికి పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో, ఆ హీరోయిన్ అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిందట. పెళ్లి విషయం మాట్లాడిన అఖిల్ పరోక్షంగా తిట్టిందట. తన పెంపుడు కుక్కను తిడుతున్నట్లు ''ఛీ ఈ కుక్కకు ఎన్ని సార్లు చెప్పినా ఇంతే...మాట వినదు'' అని అందట. దీనితో అఖిల్ అవమానంగా ఫీలై ఆమెకు బ్రేకప్ చెప్పాడట. ఈ విషయాన్ని గంగవ్వ వివరించడం జరిగింది. 

ప్రస్తుతం హౌస్ లో అఖిల్ హీరోయిన్ మోనాల్ తో సన్నిహితంగా ఉంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారంపై హౌస్ నుండి బయటికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ మాట్లాడారు. గంగవ్వ సైతం అఖిల్ ఎప్పుడూ మోనాల్ చుట్టూ  తిరుగుతున్నాడని చెప్పింది. అఖిల్ తన ఆట కూడా సరిగా ఆడడం లేదని చెప్పింది. హౌస్ లో వీరిద్దరి బంధం ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.