హీరో నాని, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్స్ కూడా డీసెంట్ గానే వచ్చినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రూ.21కోట్లకు మార్కెట్ చేశారు. మొదటిరోజే దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది.. ఇంకా శని, ఆదివారాల్లో సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. 

ఏరియాల వారీగా సినిమా కలెక్షన్స్.. 

నైజాం...............రూ.1.67 కోట్లు
సీడెడ్...............రూ.0.52 కోట్లు
ఉత్తరాంధ్ర,......రూ.0.62 కోట్లు
ఈస్ట్.................రూ.0.52 కోట్లు
వెస్ట్..................రూ.0.30 కోట్లు
కృష్ణ.................రూ.0.33 కోట్లు
గుంటూరు........రూ.0.46 కోట్లు
నెల్లూరు............రూ.0.15 కోట్లు

ఓవరాల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.4.57 కోట్ల వసూళ్లు రాబట్టింది.