మంచి అంచనాలతో నాని గ్యాంగ్ లీడర్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నాని కామెడీ టైమింగ్ కు మంచి స్పందన వస్తోంది. సీనియర్ నటీమణులు శరణ్య, లక్ష్మి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇక ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటించింది. 

ఈ చిత్రంలో నాని పెన్సిల్ పార్థసారథి అనే రచయితగా నటించాడు. సరదాగా సాగిపోయే రివేంజ్ డ్రామాగా విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తొలి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. 

యుఎస్ మార్కెట్ లో కూడా నాని చిత్రాలకు మంచి పట్టు ఉంది. గ్యాంగ్ లీడర్ చిత్రం యుఎస్ ప్రీమియర్స్ ద్వారా 182,679 డాలర్లు రాబట్టునట్లు తెలుస్తోంది. మొత్తం 177 లొకేషన్స్ లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇది మంచి ఆరంభమే అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ గ్యాంగ్ లీడర్ చిత్రం సాధించే వసూళ్ళని బట్టి సక్సెస్ రేంజ్ ఉంటుంది.