నాని 'గ్యాంగ్ లీడర్' చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

నాని కామెడీ టైమింగ్ జనాలను ఆకట్టుకుంటోంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టినఈ సినిమా మొదటి వారాంతంలో డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకే పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా రాబట్టింది. మొదటివారానికే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి వీకెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.11.84 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మొదటి మూడు రోజులకు 7 లక్షల 25 వేల డాలర్లు వసూలు చేసింది. 

ప్రాంతాల వారీగా సినిమా కలెక్షన్స్ (షేర్.. కోట్లలో)
నైజాం - 4.67
సీడెడ్ - 1.48
ఉత్తరాంధ్ర - 1. 57
గుంటూరు - 1.09
తూర్పు గోదావరి - 1.06
కృష్ణా - 0.93
నెల్లూరు - 0.36
పశ్చిమ గోదావరి - 0.68
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలిపి ఈ సినిమా రూ. 11.84 కోట్ల వసూళ్లు రాబట్టింది.