`భగవంత్ కేసరి` దసరాకి రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పట్నుంచి సినిమా ద్వారా పండగ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది యూనిట్. అందులో భాగంగానే `గణేష్ ఆంథమ్`ని రిలీజ్ చేశారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం `భగవంత్ కేసరి`. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో బాలయ్యకి జోడీగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తుంది. కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమా నుంచి గణేష్ ఆంథమ్‌ని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ పూర్తి పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేసింది యూనిట్. రానున్నది వినాయక చవితి కావడంతో పండక్కి మోత మోగిపోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటని విడుదల చేశారు.
`భగవంత్ కేసరి` దసరాకి రిలీజ్ కాబోతుంది. దీంతో ఇప్పట్నుంచి సినిమా ద్వారా పండగ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది యూనిట్. అందులో భాగంగానే `గణేష్ ఆంథమ్`ని రిలీజ్ చేశారు. ఇందులో వినాయక చవితి పండుగ సందర్భంగా వచ్చే పాట ఇది. ఇందులో బాలకృష్ణ, శ్రీలీల కలిసి నటించారు, నర్తించారు. ఎల్లో డ్రెస్ వేసుకుని వచ్చిన బాలయ్య.. అక్కడ కొట్టే సౌండ్ సరిపోవడం లేదని శ్రీలీలతో చెప్పగా, అదే చిచ్చా వచ్చిండు తీసి పక్కన పెట్టండి మీతీన్ మార్.. అంటూ కొత్త సౌండ్ చూపిస్తుంది. దీంతో మోత మోగిస్తుంటారు.
దీనికి బాలయ్య, శ్రీలీల రెచ్చిపోయి డాన్సు చేశారు. రచ్చ రచ్చ చేశారు. డాన్సులకు కేరాఫ్ శ్రీలీల. ఈ బ్యూటీ ఇందులో మరోసారి రెచ్చిపోయింది. హై ఓల్టేజ్ ఎనర్జీతో డాన్సులు చేస్తూ రచ్చ చేస్తుంది. బాలయ్య సైతం రెట్టింపు ఎనర్జీతో డాన్సులు చేయడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ పాట ఆకట్టుకోవడంతోపాటు దుమ్మురేపుతుంది. ఈ పాటకి థమన్ సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ రాశారు. కరీముల్లా, మనీషా పాండ్రంకి ఆలపించారు. శేఖర్ మాస్టర్ డాన్సు కొరియోగ్రఫీ చేశారు.

`భగవంత్ కేసరి` సినిమాలోని గణేష్ ఆంథమ్ సినిమాపై పాజిటివ్ బజ్‌ని ఏర్పర్చుతుంది. దసరా పండక్కి సందడి వేరే లెవల్ ఉండబోతుందని తెలియజేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సినిమా పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 19న విడుదల కాబోతుంది.
