దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం రెండు సినిమాలను రూపొందిస్తున్నారు. కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌2`, రమ్‌చరణతో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి సంబంధించిన రిలీజ్ డేట్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

దర్శకుడు శంకర్‌ రూపొందిస్తున్న సినిమాల రిలీజ్‌ డేట్లు వచ్చాయి. రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` ఎప్పుడొస్తుందనే సస్పెన్స్ నెలకొంది. చరణ్‌ బర్త్ డేకి యూనిట్‌ క్లారిటీ ఇవ్వలేదు. ముందుగా సంక్రాంతికి అనుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు పెద్ద సినిమాలున్నాయి. మరోవైపు `ఇండియన్‌ 2` కూడా రాబోతుందని అన్నారు. దీంతో ఈ రెండు సినిమాల రిలీజ్‌కి సంబంధించి పెద్ద సస్పెన్స్ నెలకొంది. తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్లు కన్ఫమ్‌ అయ్యాయి. 

శంకర్‌ ఇప్పుడు ఏక కాలంలో అటు లోకనాయకుడు కమల్‌ హాసన్‌తో `ఇండియన్‌ 2`, ఇటు రామ్‌చరణ్‌తో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో మొదట `ఇండియన్‌2`ని తీసుకురాబోతున్నారు శంకర్‌. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. మరోవైపు రామ్‌చరణ్‌తో చేస్తున్న `గేమ్‌ ఛేంజర్‌`ని వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్ ఆల్మోస్ట్ కన్పమ్‌ అని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఇక ప్రస్తుతం శంకర్‌.. కమల్‌తో `ఇండియన్‌2` చిత్ర షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. అమెరికాలోని జోహన్సన్‌బర్గ్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరించబోతున్నారట. తాజాగా అమెరికాలో సందడి చేస్తున్న కమల్‌ హాసన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన ఓ హోటల్‌లో కుండిని సంగీత వాయిద్యంగా మార్చుకుని వాయిస్తున్నారు. మరోవైపు సోఫాలో కూర్చొని రిలీక్స్ అవుతున్నారు. దీంతోపాటు హెలికాఫ్టర్‌లో విహరిస్తూ కనిపించారు. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, సిద్ధార్థ్‌, రకుల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

మరోవైపు శంకర్‌.. రామ్‌చరణ్‌తో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది దాదాపు సగం వరకు షూటింగ్‌ జరుపుకుంది. `ఇండియన్‌ 2` కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. ఈ సినిమాని సమ్మర్‌కి విడుదల చేయబోతున్నారట. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌ వంటి వారు నటిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. `ఇండియన్‌ 2` తెలుగు రైట్స్ ని దిల్‌ రాజే కొన్న విషయం తెలిసిందే.