Asianet News TeluguAsianet News Telugu

పెంపుడు కుక్కతో కలిసి 777 చార్లీ మూవీ చూసిన గాలి జనార్థన్ రెడ్డి, సోషల్ మీడియాలో స్పందించిన సెలబ్రిటీ

కన్నడ యంగ్ స్టార్ రక్షిత్ శెట్టి చేసిన ప్రయోగానికి స్టార్స్ నుంచి రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఒక పెంపుడు జంతువు గురించి తీసిన సినిమా.. అటు ఫిల్మ్ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా తన పెంపుడు కుక్కతో కలిసి 777 చార్లీ  మూవీ చూసిన గాలి జనార్థన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. 

Gali Janardhana Reddy Watches Charlie 777 Movie
Author
Hyderabad, First Published Jun 26, 2022, 4:41 PM IST

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గాలి జ‌నార్దన్ రెడ్డి త‌న పెంపుడు కుక్క‌తో క‌లిసి బ‌ళ్లారి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌లో 777 చార్లీ సినిమాను వీక్షించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జ‌నార్దన్ రెడ్డికి చిన్న‌ప్ప‌టి నుండి పెంపుడు జంతువులంటే ఇష్టం. కాగా త‌న ద‌గ్గ‌ర లాబ్రాడ‌ర్ జాతికి చెందిన కుక్క ఉంది. దానికి రాఖీ అనే పేరు పెట్టారు. 

ఇక సినిమాను చూసిన అనంత‌రం జ‌నార్దన్ రెడ్డి సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్‌ చేశాడు.నాకు చిన్నప్పటి నుండి పెంపుడు జంతువులంటే అభిమానం, ప్రేమ. నేను కూడా ఆవులను ప్రేమిస్తాను, పిల్లులతో ఆడుకుంటాను. ప‌క్షులు, జంతువుల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. నా డిఫిక‌ల్ట్ రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఒక పెట్‌ను పోషించాను. దానితో ప్రేమతో గడిపాను అని ఎమోష‌నల్ నోట్ రాశాడు. 
అంతేకాకుండా త‌న కుక్క‌కు రాఖీ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపాడు.

 

ఇక అంతకు ముందు 777 చార్లీ సినిమా వీక్షించాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. అంతేకాదు సినిమా బాగుందంటూ తనకు ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడట. ఈ విషయాన్ని హీరో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు రక్షిత్ శెట్టి. ఈ రోజు ఎంతో గొప్పగా మొదలైంది. రజనీకాంత్‌ సర్‌ ఫోన్‌ చేశారు. నిన్న రాత్రి 777 చార్లీ చూసి అద్భుతంగా ఉందని ఫీలయ్యారు. సినిమాను అంత క్వాలిటీగా, ఎంతో లోతుగా టచ్ చేసేలా తీయడం, క్లైమాక్స్‌ తెరకెక్కించిన విధానం, ఆధ్యాత్మిక కోణంలో ముగించడం బాగుందని మెచ్చుకున్నారు. సూపర్ స్టార్ నోటి నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో సంతోషంగా అనిపించింది.. థాంక్యూ రజనీకాంత్‌ సర్‌' అని ట్వీట్‌ చేశాడు.

ఇక అంతకు ముందు కర్ణాటక  ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఈ సినిమా చూసి చిన్న పిల్లాడిలో ఏడ్చేశాడు. ఆయన ఆమధ్య కర్ణాటకలో చార్లీ 777  సినిమా చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి కంటనీరు పెట్టుకున్నారు. ఇందుకు కారణం ఆయన పెంపుడు కుక్క గుర్తుకు రావడమే.ఆయన ఎంతో ఇష్టంగా, ప్రేమగా పెంచుకున్న, చూసుకున్న పెట డాగ్ స్నూబీ మరణించింది. బసవరాజు బొమ్మై సీఎం పదవి అధిరోహించడానికి కొన్ని వారాల ముందు ఈ ఘటన జరిగింది. 

తన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు సీఎం బసవరాజు బొమ్మై బోరున విలపించాడు. ఆ కుక్క డెడ్ బాడీకి పూల మాల వేసి ఉండగా.. ఆయన తన మోకాళ్లపై కూర్చుని కన్నీటి పర్యంతమైన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.777 చార్లీ సినిమా జూన్ 10న ఐదు భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో హీరో, ఆయన కుక్కకు మధ్య ఉన్న బాండింగ్‌ను హృద్యంగా చిత్రించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios