Asianet News TeluguAsianet News Telugu

మరో సారి పాడి, నటిస్తూ తెరపై కనిపించనున్న గద్దర్‌!

సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంలోని ‘మేలుకో రైతన్నా.. మేలుకో’ పాటను రచించి గానం చేశారు గద్దర్. ఈ పాటలో గద్దర్‌ స్వయంగా నటించడం విశేషం. సుడిగాలి సుధీర్‌హీరోగా,  ధన్యాబాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.

Gaddar Special Role In 'Software Sudheer'
Author
Hyderabad, First Published Aug 1, 2019, 9:25 AM IST

‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా’ అంటూ గద్దర్ పాడిన ఉద్యమ పాటఅప్పట్లో ఉద్యమానికి ఊపు తెచ్చింది.  ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై బోలో తెలంగాణ’లోని ఈ పాట ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ‘మేలుకో రైతన్నా.. మేలుకో’ అంటూ మరో సందేశాత్మక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంలోని ఈ పాటను రచించి గానం చేశారు.  ఈ పాటలో గద్దర్‌ స్వయంగా నటించడం విశేషం. సుడిగాలి సుధీర్‌హీరోగా,  ధన్యాబాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం-1గా కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’.ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

గద్దర్‌ మాట్లాడుతూ – ”సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రంలో ‘మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో’ అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ –  ”కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించించి ఈ క్యారెక్టర్‌ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్‌తో కలిసి వర్క్‌ చేసే అవకాశం దొరికింది. హీరోయిన్‌ ధన్యా బాలక ష్ణతో షూటింగ్‌ చాలా ఫన్‌గా సాగుతోంది. అలాగే దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డిలో మంచివిజన్‌ ఉంది. మా సినిమాలో గద్దర్‌ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది” అన్నారు.

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించడం విశేషం. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివప్రసాద్‌, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతమ్‌రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, మ్యూజిక్‌: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, డాన్స్‌: శేఖర్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ఆర్ట్‌ డైరెక్టర్‌: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్‌ ఉపాధ్యాయ, ప్రొడ్యూసర్‌: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

 

Follow Us:
Download App:
  • android
  • ios