Asianet News TeluguAsianet News Telugu

ఛీ ఛీ అంటూ తేజ లోదుస్తులు విప్పిన అమర్ దీప్.. పాపం బాయ్స్ మధ్యలో నలిగిపోతూ అశ్విని తిప్పలు 

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 54 రసవత్తరంగా సాగింది. గేమ్స్ అన్నీ మసాలా అంశాలతో వినోద భరితంగా సాగాయి. కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత సాధించడం కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు నిర్వహించారు.

funny incident between teja and amar deep in bigg boss house dtr
Author
First Published Oct 26, 2023, 10:34 PM IST | Last Updated Oct 26, 2023, 10:34 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ 54 రసవత్తరంగా సాగింది. గేమ్స్ అన్నీ మసాలా అంశాలతో వినోద భరితంగా సాగాయి. కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత సాధించడం కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు నిర్వహించారు. ముందుగా స్టోరిట్ పోరిట్ అనే గేమ్ పెట్టారు. ఈ గేమ్ లో అశ్విని, అర్జున్, భోలే, సందీప్ పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరి తలపై స్పాంజ్ లు హెల్మెంట్ తరహాలో పెడుతారు. షవర్ కింద నిలబడి ఆ తర్వాత స్పాంజ్ లలో నీటిని ఎవరి కంటైనర్లలో వాళ్ళు నింపుకోవాలి. ఒక షవర్ మాత్రమే ఉంటుంది కాబట్టి పోటీ పడి స్పాంజ్ లు తడుపుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్ లో అశ్విని ఒక్కరే మహిళ. ఆమె బాయ్స్ డామినేషన్ ని తట్టుకోలేక నలిగిపోయింది. అయినప్పటికీ తొలి రౌండ్ లో భోలే కంటే ఎక్కువ వాటర్ సాధించింది. భోలే తన వాటర్ ని అశ్వినికి దానం చేశాడు. కానీ అశ్విని సందీప్, అర్జున్ లతో పోటీ పడి వాటర్ సాధించలేకపోయింది. గేమ్ నుంచి తప్పుకుంటూ ఆమె తన వాటర్ ని సందీప్ మాస్టర్ కి దానం చేసింది. 

దీనితో ఎక్స్ట్రా గా వచ్చిన వాటర్ సందీప్ కి అడ్వాంటేజ్ గా మారాయి. దీనితో అతడు అర్జున్ పై సులభంగా విజయం సాధించాడు. కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత సాధించాడు. ఆ తర్వాత గ్యాప్ లో రతిక, యావర్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. ప్రియాంక మనిద్దరికీ ఎఫైర్ అంటగడుతోంది అని రతిక యావర్ కి చెప్పింది. వాళ్లంతా ఒకే బ్యాచ్ ఆ సంగతి నాకు ముందే తెలుసు అని యావర్ అన్నాడు. 

ఇంతలో మరో గేమ్ నిర్వహించారు. కంటైనర్లలో ఉన్న బాల్స్ ని ఒంటి చేత్తో వేగంగా ఖాళీ చేయాలి. ఈ గేమ్ లో గౌతమ్ విజయం సాధించి కెప్టెన్సీ కంటెండర్ గా అర్హత పొందారు. చివరకి బిగ్ బాస్ ఇచ్చిన మరో ఆసక్తికర టాస్క్ వేగంగా ఎక్కువ బట్టలు ధరించడం. ఈ గేమ్ లో యావర్, తేజ, శోభా శెట్టి పాల్గొన్నారు. ఈ టాస్క్ కి శివాజీ సంచాలకుడు. 

ఫలితాలు నిర్ణయించేటప్పుడు తమాషా ఘటన చోటు చేసుకుంది. సంచాలక్ ఒక్కొక్కరి బట్టలు తీసి లెక్కించాలి. శివాజీ చేయి బాగా లేకపోవడంతో అమర్ డీప్ సాయం చేశాడు. తేజ బట్టలు ఒక్కొక్కటి విప్పాడు. తేజ పైన లోదుస్తులు కూడా ధరించడంతో అమర్ దీప్ వాటిని కూడా విప్పాల్సి వచ్చింది. ఛీ ఛీ అనుకుంటూ అమర్ దీప్ ఇబ్బంది పడడం అందరిని నవ్వించింది. 

ఈ గేమ్ లో యావర్ 70 బట్టలు ధరించగా.. శోభా శెట్టి 72 దుస్తులు ధరించి విజయం సాధించింది. చివరకి ప్రియాంక, ప్రశాంత్, గౌతమ్, సందీప్, శోభా శెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత పొందారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios