మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. రవితేజ స్టైల్ లో ఫుల్ మాస్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఆ మధ్యన విడుదలైన అట్టా సూడకే సాంగ్ మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. తాజాగా మరో మాస్ సాంగ్ విడుదలయింది. 'ఫుల్ కిక్కు' అంటూ సాగే ఈ పాటని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లిరికల్ వీడియోలో రవితేజ, డింపుల్ హయతి మాస్ స్టెప్పులని కూడా చూపించారు. 

డింపుల్ హయతి అందాలు ఆరబోస్తూనే ఊర మాస్ గా స్టెప్పులేస్తూ మంచి కిక్ ఇస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాస్ ప్రేక్షకులు కోరుకునే విధంగా నరాల్లో ఉత్తేజం నింపే ఎనర్జిటిక్ బీట్ అందించారు. 

శ్రీమణి ఈ పాటకు సాహిత్యం అందించారు. సాగర్, మమతా శర్మ ఈ పాటకి అద్భుతమైన గాత్రం అందించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇద్దరూ పోటీ పడి మరీ అందాలు ఆరబోశారు. సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. 

అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులే ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే ఖిలాడీ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. 

Scroll to load tweet…