Asianet News TeluguAsianet News Telugu

ఈవారం ‘ఆహా’లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌.. అన్ స్టాపబుల్ 2, డాన్స్ ఐకాన్, చెఫ్ మంత్ర 2లో స్టార్స్ సందడి!

ఇంట్రెస్టింగ్ కంటెట్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పుడూ ముందుంటుంది ‘ఆహా’ (Aha). ఈ వారం మాత్రం మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో లేటెస్ట్ ఎపిసోడ్స్ ద్వారా అలరించబోతోంది. 
 

Full entertainment in Aha with Latest episodes of Unstoppable 2 and Dance Ikon!
Author
First Published Nov 1, 2022, 2:06 PM IST

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha) మంచి రేటింగ్, వ్యూయర్షిప్ తో దూసుకుపోతోంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ తో ప్రేక్షకులను నిత్యం అలరించేందుకు ‘ఆహా’ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో అద్భుతమైన సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకాదరణ పొందింది. మరోవైపు అదిరిపోయే షోలను కూడా ప్రసారం చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఇక ఈ వారం మాత్రం రన్నింగ్ షోలకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్స్ ద్వారా మరెన్నడూ లేనంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరించబోతోంది. 

తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ మాధ్యమం ఆహా. ప్రతి వారం ఆడియెన్స్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ షోస్‌తో ఆహా అలరిస్తోంది. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2 (Unstoppable with NBK2)లో  హీరోలు అడివి శేష్, శర్వానంద్ గెస్టులుగా అలరించబోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ యంగ్ హారోలతో బాలయ్య ఎలా సందడి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్  రియాలిటీ షో సక్సెస్ తర్వాత మరోసారి నాన్-ఫిక్షన్ లో తన సత్తాచాటుకోవడానికి ‘డాన్స్ ఐకాన్’ (Dance Ikon)తో సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ ని ఈ షో కి బ్రాండ్ అంబాసిడర్ లా ఆహ్వానించారు. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ రమ్య కృష్ణన్ జడ్జ్ గా కొనసాగుతున్నారు. ఈ షో ఆడియెన్స్ లో మంచి ఆదరణ పొందింది. చిన్నారుల్లోని గొప్ప డాన్సింగ్ టాలెంట్‌ను బయటపెట్టే ఈ డాన్స్ షో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డాన్స్ షోగా పేరొందింది. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్‌లోని బెస్ట్ టాలెంట్‌ను ప్రతివారం ఈ షో బయటకు తీసుకొస్తుంది. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వారం ఎపిసోడ్ లో  యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ముఖ్య అతిథిగా ప్రేక్షకులను అలరించబోతోంది.
 
నటి, నిర్మాత, రచయిత, దర్శకురాలు, సామాజిక వేత్త, ఎన్‌ఎఫ్‌టి కలెక్టర్ లక్ష్మీ మంచు మంచి భోజన ప్రియురాలు. అలాంటి ఆమె చెఫ్ మంత్ర సీజన్ 2 (Chef Mantra 2)కి హోస్ట్‌గా మారారు. కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జీవన విధానం, జీవన శైలిని అనుసరించి సరికొత్త ఫుడ్ ఐటెమ్స్‌ను తయారు చేస్తారు. ఈ వారం రష్మీ గౌతమ్, గెటప్ శీను షోలో అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ షో సమయంలో వారు వారికి నచ్చిన ఆహారం, దానితోనే ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటారు. ఈషోలో తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios