Asianet News TeluguAsianet News Telugu

ఒక ముస్లీం అయ్యుండి మహాభారతం ఎలా తీస్తాడు.? : ఫ్రాంకోయిస్

  • మహాభారతంను తెరకెక్కించాలనేది తన ఆలోచన అని ఆమిర్ ఖాన్ వ్యక్తం చేశారు
  • మహాభారతం’లో కృష్ణుడి పాత్రను ఆమిర్ ఖాన్ పోషించాడనుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం​
  • ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు​
Francois Chalais sensational comments on Aamir

మహాభారతంను తెరకెక్కించాలనేది తన ఆలోచన అని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన మనసులో మాట వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్న ఈ సినిమాకు నిర్మాతగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యవహరిస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం. ‘మహాభారతం’లో కృష్ణుడి పాత్రను ఆమిర్ ఖాన్ పోషించాడనుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ కాలమిస్ట్ ఫ్రాంకోయిస్ గ్వాటియర్ ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. ముస్లిం అయిన ఆమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించడమేంటి? ఆయన నటించడమేంటి? అని ప్రశ్నించారు. మహ్మద్ ప్రవక్త పాత్రలో ఓ హిందువు నటించేందుకు ముస్లిం మతస్థులు ఒప్పుకుంటారా? అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ట్వీట్ పై ప్రముఖ పాటల రచయిత  జావేద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. ఫ్రాన్స్ కు చెందిన దర్శకుడు పీటర్ బ్రూక్స్ ‘ది మహాభారత్’ ను తెరకెక్కించలేదా? అని ప్రశ్నించిన ఆయన, ఇలాంటి విషపూరిత వ్యాఖ్యలు చేయమని ఏ విదేశీ ఏజెన్సీ డబ్బులిస్తోందంటూ ఫ్రాంకోయిస్ పై జావేద్ అక్తర్ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios