Asianet News TeluguAsianet News Telugu

ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌ కోసం నలుగురు హీరోయిన్లు.. ఫైనల్‌ ఆమేనా?

ప్రముఖ గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా సినిమా రాబోతుంది. ఈ బయోపిక్‌ కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఫైనల్‌ అయ్యేది ఎవరు?
 

four heroines names considered for ms Subbulakshmi biopic final that heroine ? arj
Author
First Published May 24, 2024, 5:20 PM IST


బయోపిక్‌ సినిమాలు ఇటీవల పెద్దగా  ఆదరణ పొందడం లేదు. ఒకప్పుడు ఉన్న క్రేజ్‌ ఇప్పుడు  రావడం లేదు. అందుకే బయోపిక్‌ చిత్రాలు తగ్గాయి. అదే సమయంలో ఆదరణ కూడా తగ్గింది. ఈ క్రమంలో ఓ బయోపిక్‌ గురించి చాలా రోజులుగా టాక్‌ వినిపిస్తుంది. అదిగో, ఇదిగో అనే వార్తలే ఎక్కువగా ఉన్నాయి. అందులో నటించేది వారే అనే చర్చ ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్లు ఉండటం లేదు.  అలా మరోసారి వార్తల్లో నిలుస్తున్న బయోపిక్‌.. ప్రముఖ గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా  ఓ ఆసక్తికర  వార్త వైరల్‌ అవుతుంది. 

అయితే ఈ సారి ఈ బయోపిక్‌ కోసం నలుగురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం విశేషం. అందులో నయనతార, రష్మిక మందన్నా, త్రిష, కీర్తిసురేష్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.  ఈ బయోపిక్‌ కోసం మేకర్స్ ఈ నలుగురుని సంప్రదించారట. వీరితో చర్చలు జరిగాయట. ఇందులో ఎవరు ఫైనల్‌ అనేది ఆసక్తికరంగా మారింది. చాలా మంది నయనతార పేరు చెబుతున్నారు. ఆమె ఓకే అయ్యిందన్నారు. అలాగే త్రిష పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు నేషనల్‌ వైడ్‌గా  క్రేజ్‌ ఉన్న రష్మిక మందన్నా పేరు కూడా ప్రధానంగా  వినిపిస్తుంది.

అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ముగ్గురు కాదని తెలుస్తుంది. `మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌ని అనుకుంటున్నారట. ఆమె ఫైనల్‌ అయ్యిందని, తను కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు ఇప్పుడు మెయిన్‌గా వినిపిస్తున్నాయి. `మహానటి`లాంటి  మూవీలో నటించి అదరగొట్టింది కీర్తి సురేష్‌. సావిత్రి అంటే ఇలానే  ఉంటుందేమో అని ఈ తరానికి అనిపించేలా చేసింది. ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. 

four heroines names considered for ms Subbulakshmi biopic final that heroine ? arj

ఈ నేపథ్యంలో ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాత్రకి తాను బాగా సెట్‌ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఆమెని ఫైనల్‌ చేశారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి  ఉంది. ఈ మూవీని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించబోతున్నారట. దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

ప్రస్తుతం కీర్తిసురేష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమెకి తెలుగులో సినిమాలు లేవు, కానీ  తమిళంలో మూడు సినిమాలున్నాయి. అందులో `రాఘుతాత`, `రివాల్వర్‌ రీటా`, `కన్నివేడి` చిత్రాలుండగా,  హిందీలో వరుణ్‌ ధావన్‌తో కలిసి `బేబీ జాన్‌` చేస్తుంది. ఇందులో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంటుందని తెలుస్తుంది. దీంతోపాటు అక్షయ్‌ కుమార్‌తో ఓ సినిమాకి  చర్చలు జరుగుతున్నాయని టాక్‌. 

ఎంఎస్‌ సుబ్బలక్ష్మి తమిళంలోని మధురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె గాయనిగా ఎదిగే క్రమంలో అనేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేశారు. చాలా విషాద ఘటనలు ఉన్నాయి. ఆడుపోట్లు ఉన్నాయి. అవమానాలున్నాయి. వాటిని దాటుకుని ఆమె ప్రపంచం కీర్తించే గాయనిగా ఎదిగారు. ప్రధానంగా  కర్నాటక సంగీతాన్ని ఆమె బాగా విస్తరించారు. ఆమెకి అనేక పురస్కారాలు వరించాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios