ఆ మోడల్‌ను సజీవంగా తినేసిన పరాన్నజీవులు!

former model eaten alive while in care of georgia nursing
Highlights

బతికుండగానే తినేసిన పురన్నజీవులు

ఒక వ్యక్తిని బతికుండగానే తినేసే పరాన్న జీవులు కూడా ఉంటాయనే సంగతి మీకు తెలుసా? అయితే, తప్పకుండా ఈ మాజీ మోడల్ మరణం గురించి తెలుసుకోవల్సిందే. రెబెక్కా జెనీ (93) అనే మాజీ మోడల్‌.. 2015లో గజ్జితో చనిపోయింది. అయితే, అది సాధారణ మరణం కాదని ఆమె మరణానంతర విచారణ తర్వాత తేలింది. 

అయితే, కొన్నాళ్లు ఆసుపత్రికే పరిమితమైన జెనికి 2013లో గజ్జిలాంటి ఇన్ఫెక్షన్ సోకింది. ఇది చాలా బాధ కలిగించే వ్యాధి. దీనివల్ల శరీరం బాగా దురద పెడుతుంది. ఈ ఇన్ఫెక్షన్లో ఉండే పరాన్న జీవులు చర్మంలోని పైపొరలో గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటాయి. దీంతో శరీరంపై దద్దర్లు ఏర్పడతాయి. పరాన్న జీవులు శరీరమంతా వ్యాపించి క్రమేనా చర్మాన్ని తొలిచేస్తాయి. 

జెనీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమెకు సోకిన ఈ వ్యాధిని వైద్యులు ముందుగా గుర్తించలేదు. దీంతో అది చికిత్సకు కూడా లొంగని విధంగా ముదిరిపోయింది. ఆమెకు వయస్సు మీద పడటం, రోగ నిరోధక శక్తి తగ్గడం ఫలితంగా ఆమె శరీరమంతా పరాన్న జీవులకు క్రమేనా ఆహారమైంది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు రెండేళ్లపాటు ఆమె ఆ నరకయాతన అనుభవించింది. చివరికి 2015లో ఆమె మరణించింది.ఆమె చనిపోయిన తర్వాత శరీరంలో వంద మిలియన్ పరుగులు కనుగొన్నామని తెలిపారు. అవి ఆమెను బ్రతికుండానే తినేశాయని, ఆమె ఎంతో నొప్పిని అనుభవిస్తూ చనిపోయారని తెలిపారు. ఇది తప్పకుండా వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందేనని వెల్లడించారు. 

loader