పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఈ  చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.  మూవీలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు తెలిస్తోంది. ఈ మేరకు నాగ్ అశ్విన్ మహీంద్రా గ్రూప్ హెడ్ సాయం కోరారు.  

దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) వరుస హిట్ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ మరియు ‘మహానటి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తన సత్తాను నిరూపించుకున్నాడు. కామిక్ మూవీ జాతిరత్నాలు మూవీతో ప్రొడ్యూసర్ గా కూడా మారాయి. మరోవైపు ఓటీటీలోనూ ‘పిట్ట కథలు’తో తన మార్క్ క్రియేట్ చేశాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు, నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో భారీ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ కే’ అనే టైటిట్ ను ఖరారు చేశారు. 

సైన్స్ - ఫిక్షన్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అత్యాధునిక భారీ వెహికిల్స్ ను వినియోగించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆ వాహనాలను తయారు చేయించే పనిలో ఉన్నాడు నాగ్. ఇందు కోసం ప్రముఖ కంపెనీ మహీంద్రా గ్రూప్ ను సంప్రదించారు. కంపెనీ సహకారం కోరుతూ అశ్విన్ తాజాగా ట్విట్టర్ లో మహీంద్రా గ్రూప్ హెడ్ ఆనంద్ మహీంద్రాను అభ్యర్థించారు. 

‘ప్రియమైన ఆనంద్ మహీంద్రా సార్.. మేము ది గ్రేట్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మరియు దీపికతో కలిసి ProjectK అనే భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ మూవీలో వినియోగించబోయే వాహనాలు ప్రస్తుత టెక్నాలిజీతో రూపుదిద్దుకోలేవు. ఇందుకు మీ వద్ద ఉన్న ప్రముఖ ఇంజనీర్లను, డిజైనర్ల బృందం సహకారం అవసరం ఉంది. ఇందుకు స్పందించి మాకు సహాయం చేస్తే గౌరవంగా ఉంటుంది’.. అని ట్వీట్ చేశారు. బాహుబలి విజయం తర్వాత ప్రభాస్ మహీంద్రా TUV300 ప్రకటనలో నటించారు. ఈ మేరకు మహీంద్రా కంపెనీ హెడ్ ఎలా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. ప్రభాస్ చివరిగా నటించిన ‘సాహో’చిత్రానికి కూడా యాక్షన్ సీన్ల కోసం మూడు ప్రత్యేక వాహనాలను తయారు చేయించారు. అప్పుడు ఒక్కో వాహనం తయారీకి రూ.కోటి ఖర్చు అయ్యింది.

Scroll to load tweet…

ప్రాజెక్ట్ కే చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan), దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ తో కలిసి ప్రభాస్ ఫస్ట్ షాట్ లో పాల్గొన్నట్టు ప్రభాస్ తెలిపారు. ఇందుుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ మూవీకి సంబంధించి దాదాపుగా అర్దభాగం షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇక ప్రభాస్, పూజా హెగ్దే (Pooja Hegde) జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.