అన్నపూర్ణ అగ్ని ప్రమాదం సమంత "లెగ్" మహిమనా?

First Published 15, Nov 2017, 9:45 AM IST
foolish mentality writes cruel articles about samantha on annapurna fire
Highlights
  • అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం
  • ఇటీవలే అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత
  • సమంత లెగ్ వల్లే ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం

సమంత అక్కినేని వారింట అడుగుపెట్టిన వేళా విశేషం నాగార్జున నటించిన రాజుగారి గది 2 సినిమా హిట్ అవటం అలా జరిగిపోయింది. ఈ మూవీలో సమంత కూడా నటించడంతో ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు మామా కోడళ్లకు ఒకేసారి మూవీ సక్సెస్ దక్కింది.  అదీ  సమంత రుత్ ప్రభుత కాస్తా సమంత అక్కినేనిగా మారిన తర్వాత. అంతా ఆ ఆనందంతో వున్నారు. పైగా ఈ పన్నెండో తేదీనే గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసారు నాగ్. సినీ రాజకీయ ప్రముఖులంతా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.

 

సినీ నటుడు నాగార్జున ట్విట్టర్ ద్వారా తన ఎమోషన్స్ ని పంచుకున్నారు. సమంత నాగ చైతన్య ల పెళ్లి జరిగిన నెల తరవాత గ్రాండ్ పార్టీ ఇచ్చిన నాగార్జున ఇప్పుడు తన మనసులో భావోద్వేగాలు పంచుకుంటున్నారు. " ఈ వారం అంతా కూడా ఉద్వేగభరితంగా గడిచింది.  నవ్వుకున్నాం ఏడ్చాం. అంతా 'మనం' అనే ప్రేమే " అంటూ రాసుకొచ్చారు ఆయన.

 

మొన్న సమంత - చైతన్య ల గ్రాండ్ రిసెప్షన్ తరువాత నిన్న అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ లు మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది సినిమాల  సెట్ ల వరకూ కాలి బూడిద అయ్యాయి. మొత్తంగా 3 కోట్లు నష్టం వాటిల్లింది అంటున్నారు.

 

ఇక హలో టీజర్ 16న రిలీజ్  చేయబోతున్నట్లు చెప్పారు నాగ్. దానికి సంబంధించిన ప్రమోషన్ పోస్టర్ అఖిల్ ట్విటర్ నుంచి ఈ14నే రిలీజ్ చేశారు. ఓ వైపు చై, సమంతల రిసెప్షన్ హడావుడి, మరోవైపు అఖిల్ తాజా చిత్రం 'హలో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనులతో నాగార్జున ఫ్యామిలీ ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

 

ఇంతలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుని సెట్స్ అన్నీ తతగలబడి భారీగా ఆస్తి నష్టం సంబవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా వుంటే అసలు ఈ ప్రమాదానికి కారణం సమంత 'లెగ్' మహిమ అంటూ  అగ్నిప్రమాదం గురించి కొందరు మూర్ఖంగా పబ్లిసిటీ చేయడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. సోషల్ మీడియా లో కొందరు అగ్ని ప్రమాదం లెగ్ మహిమ వల్లే జరిగిందనీ, ఇన్నేళ్ళ అన్నపూర్ణ స్టూడియోస్ చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరగలేదు అని మూర్ఖపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి వుంటుందా..

loader