దాదాపు పదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి చేసిన 'ఖైదీ నెంబర్ 150' .. అంతా అనుకున్నట్టే రికార్డులను సృష్టిస్తూ దూసుకెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా .. యూఎస్ లోను ఈ సినిమా తన దూకుడు చూపిస్తోంది. ఈనెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే 47 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఇక 5 రోజులు పూర్తయ్యే నాటికి 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 5 రోజులు పూర్తయ్యే నాటికి ఈ సినిమా 106.12 కోట్ల గ్రాస్ ను .. 72. 51 కోట్ల షేర్ ను సాధించింది. కథ .. కథనాల సంగతి అటుంచితే .. చిరంజీవి ఛరిష్మానే దీనికి కారణమని చెప్పుకుంటున్నారు. టీజర్లు .. ఆడియో విషయంలోనే కాదు , వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉండటం విశేషం.