బుల్లితెరపై తొలి యాంకర్ గీతాంజలి కన్నుమూత, దూరదర్శన్ న్యూస్ ప్రజంటర్ గా రికార్డు
మొదటిసారి యాంకర్ గా బుల్లితెరపై కనిపించిన యాంకర్, న్యూస్ ప్రజెంటర్ గీతాంజలి కన్ను మూశారు.
ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఎంతో మంది ఈలోకాన్ని వదిలి వెళ్ళి పోయారు. అన్ని భాషలనుంచి స్టార్స్ మరణిస్తున్నారు. వెండితెర మాత్రమే కాదు కాదు బుల్లితెర తారలు కూడా ఎంతో మంది లోకాన్ని వదిలివెళ్ళిపోతున్నారు. ఆమధ్య సీనియర్ నటుడు శరత్ బాబు మరణం మరువకముందే.. బాలీవుడ్ లో శకుని పాత్రలకు ఫేమస్అయిన నటుడు కన్నుమూశారు. ఇక తాజాగా బుల్లితెర మొదటి యాంకర్..కమ్ న్యూస్ ప్రజెంటర్ గీతాంజలి మరించారు.
బుల్లితెర తొలితరం యాంకర్, ఇంగ్లీష్ న్యూస్ ప్రెజంటర్ గీతాంజలి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్‌లో ప్రముఖ యాంకర్, ఇంగ్లష్ న్యూస్ ప్రజెంటర్ గా పాపులర్ అయిన గీతాంజలి అయ్యర్ బుధవారం కన్నుమూశారు. ఆమె తన జీవితంలో 30 సంవత్సరాల న్యూస్‌రూమ్ కురాసిచ్చేశారు. సుదీర్ఘ కెరీర్‌లో ఉత్తమ టీవీ న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసి ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు.
1971లో గీతాంజలి అయ్యర్ దూరదర్శన్‌లో చేరారు. 1978లో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ నుండి విడిపోయినప్పుడు ఆమె దూరదర్శన్‌లోనే ఉండిపోయారు గీతాంజలి. అంతే కాదు దూరదర్శన్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదిచుకున్న ఆమె 1989లో అత్యుత్తమ మహిళలకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును గెలుచుకుంది. భారతదేశంలోని వరల్డ్ వైడ్ ఫండ్‌లో మేజర్ డోనర్స్ హెడ్‌గా గీతాంజలి పనిచేశారు.
గీతాంజలి అయ్యర్ ఇంగ్లీష్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి డిప్లొమా సంపాదించారు. ఇక గీతాంజలి మృతిపై బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపంప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.