లాక్‌ డౌన్‌ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రతీ చిన్న అకేషన్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు మెగాస్టార్‌. తాజాగా అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తాను ఉపయోగించిన తొలి కెమెరాతో పాటు తాను తీసిన తొలి ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు ఆ ఫోటోతో పాటు అభిమానులకు ఓ పజిల్‌ను కూడా వదిలాడు.

తాను తీసిన తొలి ఫోటోను మరికాసేపట్లో ట్వీట్‌ చేస్తాను అంటూ ఈ రోజు ఉదయం నుంచి అభిమానులను వెయిటింగ్‌లో పెట్టిన చిరు సాయంత్రం నాలుగున్నర సమయంలో ఆ ఫోటోను షేర్ చేశాడు. ఐదుగురు అబ్బాయిలు ఉన్న ఫోటోను షేర్ చేసిన చిరు, వీరిలో మీకు బాగా తెలిస వ్యక్తి ఉన్నాడంటూ పజిల్ ఇచ్చాడు. అయితే ఈ ఫోటోపై స్పందించిన ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆ ఫోటోలో ఉన్నది పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేశారు.