'సిల్లీఫెలోస్' ఇది ఫిక్స్!

first look poster and title of allari naresh sunil film
Highlights

అల్లరి నరేష్, సునీల్ లు కలిసి దర్శకుడు భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న 

అల్లరి నరేష్, సునీల్ లు కలిసి దర్శకుడు భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 'సుడిగాడు' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు టైటిల్ గా సుడిగాడు2 లేదంటే 'వచ్చాడయ్యో సామీ' అనే పేర్లను పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి.

మధ్యలో 'సిల్లీ ఫెలోస్' అనే పేరు కూడా వినిపించింది. అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు 'సిల్లీ ఫెలోస్' అనే టైటిల్ ను ఖరారు చేస్తూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో సునీల్... నరేష్ ను తన భుజాలపై ఎక్కించుకొని మోస్తున్నాడు. పోస్టర్ చూడడానికి కలర్ ఫుల్ గా సరదాగా ఉంది. మరి సినిమా కూడా ఆ రేంజ్ లో కామెడీను పండిస్తే సక్సెస్ కోసం పరితపిస్తున్న ఈ ఇద్దరు హీరోలు విజయాన్ని అందుకోవడం ఖాయం. 

loader