Asianet News TeluguAsianet News Telugu

ధోనీ సినిమా LGM.. ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ఇదిగో

ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ను బట్టి అర్థం అవుతోంది. విభిన్నమైన ప్రేమ కథ కమ్ పెళ్లి కథతో ఈ సినిమాను ...

First look of Dhoni Lets Get Married revealed
Author
First Published Apr 11, 2023, 4:28 PM IST | Last Updated Apr 11, 2023, 4:28 PM IST


టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొద్ది కాలం కిందటే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన భార్య సాక్షితో కలిసి నిర్మాన సంస్థను స్థాపించారు. దానికి ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే పేరు పెట్టారు.ఎంఎస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు.  LGM ( లెట్స్ గెట్ మ్యారీడ్) టైటిల్ తో సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ధోని విడుదల చేశాడు. 

తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ .. ఇవానా హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ను బట్టి అర్థం అవుతోంది. విభిన్నమైన ప్రేమ కథ కమ్ పెళ్లి కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.పోస్టర్ ను విభిన్నంగా ఒక రింగ్ లో హీరో హీరోయిన్ మరియు నదియా ను బంధించి ఉన్నట్లుగా డిజైన్ చేయడం జరిగింది.

 పోస్టర్ చూసిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో యోగి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ఈ సినిమా ను తెగ ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఆర్ జె విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంబందించిన ఇతర వివరాలు అతి త్వరలో పూర్తిగా వెల్లడి కానున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios