సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పుల కలకలం, స్టార్ హీరోకు భద్రత పెంపు..
బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పుల కలకల రేగింది. అసలే సల్మాన్ హిట్ లిస్ట్ లో ఉండటంతో.. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు..?
![Firing near Salman Khan Mumbai House and security tightened JmS Firing near Salman Khan Mumbai House and security tightened JmS](https://static-ai.asianetnews.com/images/01hvdqp0ksa913ty26qv85pcbb/whatsapp-image-2024-04-14-at-12-34-30-pm_363x203xt.jpg)
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల మోత మోగింది. ఆరోజు( ఆదివారం) తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఒక్క సారిగా గన్ ల మోత మోగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ముంబైలోని గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్ ముందు గాల్లో కాల్పులు జరిపి పారిపోయారు. మొదట మూడు రౌండ్లు కాల్చిన వారు ఆపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి వెంటనే వెళ్లిపోయారు.
దీంతో అంతాట భయంకరమైన వాతావరణం అలముకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటికి భద్రతను పెంచడంతో పాటు.. కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోయారు జనాలు. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సల్మాన్ ఖాన్ ను భయపెట్టడానికి ఈ విధంగా చేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబై క్రైమ్ బ్రాంచ్ తో పాటు అక్కడి పోలీసులు, ఫోరెన్సిక్ వారు సంఘటన స్థలం వద్ద దర్యప్తు చేస్తున్నారు. క్లూస్ ను సేకరిస్తున్నారు. ఇది ఎవరి పని అనేది త్వరలో వెల్లడిస్తామన్నారు.
అయితే సల్మాన్ ఖాన్ కు ఇప్పటికే టెరరిస్ట్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ..గతంలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ, గోల్డీ బ్రార్‌లు ఓనెన్ గా ప్రకటనలు చేశారు. అంతే కాదు ఎన్నోసార్లు రకరకాలుగా హెచ్చరికలు కూడా చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు సల్మాన్ ను భయపెట్టడానికి ఈ విధంగా చేసి ఉంటారు అని అనుమానిస్తున్నారు.
విజయ్ దళపతికి పోటీగా హాట్ హీరోయిన్, ఎలక్షన్ హీట్ పెంచబోతున్న బోల్డ్ బ్యూటీ..
2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అయితే, అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సల్మాన్‌కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటిముందు మూడు షిఫ్టుల్లో పహారా కాస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌కు ఆయుధ లైనెన్స్ కూడా మంజూరైంది. వ్యక్తిగత ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్‌కు పోలీసులు అనుమతించారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా.. బ్యాగ్ లో అది ఉండాల్సిందేనట. ఏంటో తెలుసా..