చందానగర్‌లోని జేపీ సినిమాస్‌(మల్టీఫ్లెక్స్)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. 

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల వరుసగా అగ్నిప్రమాదాలు హైదరాబాద్‌ని వెంటాడుతున్నాయి. తాజాగా చందానగర్‌లోని జేపీ సినిమాస్‌(మల్టీఫ్లెక్స్)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. జాతీయ రహదారికి పక్కనేఉన్న తపాడియస్‌ మారుతిమాల్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మాల్‌లో ఐదో అంతస్తులో ఉన్న మల్టీ ప్లెక్స్(జేపీ సినిమాస్‌)లో స్క్రీన్లు తగలబడిపోయాయి.

మల్టీఫెక్స్‌లోని 5 స్కీన్‌లలో దాదాపు అన్ని స్క్రీన్లు, ఫర్నీచర్‌, సీట్లు కాలిపోయాయని సమాచారం. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో 6, 7 అంతస్తుల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరగటంతో ఆ సమయంలో మాల్‌లో ఎవరూ లేని నేపథ్యంలో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ మూడు స్క్రీన్లు(సినిమా తెరలు) పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఇటీవలే తపాడియా మాల్‌ ప్రారంభం కాగా, అందులో పూర్తిగా షాపులు కూడా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా ? లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. కానీ ఈ ప్రమాదంతో భారీగా తెలుస్తుంది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.