Asianet News TeluguAsianet News Telugu

#LEO లోకేష్ కు మానసిక పరిక్షలు చేయంచండి! కోర్టులో కేసు

లోకేశ్​ని సైకలాజికల్​గా ఇవాల్యుయేట్​ చేయాలని కోరారు. ఆయనపై క్రిమినల్​ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

FIR Against Director Lokesh Kanagaraj, Revoking License Of #Leo jsp
Author
First Published Jan 4, 2024, 6:32 AM IST

లియో సినిమాని లీగల్ సమస్యలు వెంబడిస్తున్నాయి. మొన్నటిదాకా అందులో కీలక పాత్రలో నటించిన మన్సూర్ అలీ ఖాన్ కేసు నడిచి ముగిసింది. ఇప్పుడు  దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)పై మధురై బెంచ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  ఆ కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

 లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా.. దసరా కానుకగా అక్టోబర్‌ 19న రిలీజ్ అయిన లియో సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా తమిళ్‌తో పాటు తెలుగులో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది లియో. కానీ అనుకున్న రేంజ్ అంచనాలను అందుకోలేకపోయింది.  అయితేనేం నిర్మాతలు హ్యాపీ,హీరో హ్యాపీ. 

 ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ 2023 అక్టోబరు 18న విడుదలైంది. ప్రస్తుతం.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఎవరూ ఊహించని విధంగా  దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)పై మధురై బెంచ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లియో’ (Leo) హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ మధురైకు చెందిన రాజు మురుగన్‌ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 

దర్శకుడి మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సైకలాజికల్‌ టెస్ట్‌ నిర్వహించాలని కోరారు. మారణాయుధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింస తదితర సన్నివేశాలు ‘లియో’లో ఉన్నాయని, ఆ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బుధవారం ఆ పిటిషన్‌ విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై మధురై కోర్టుకు చెందిన జస్టిస్​ కృష్ణ కుమార్​, జస్టిస్​ విజయ్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా.. లోకేశ్‌ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడింది.
 
  ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. యాక్ష‌న్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో న‌టించారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో హీరోయిజాన్ని చూపించారు.  దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంది లియో.

Follow Us:
Download App:
  • android
  • ios