పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ పై ఒకింత సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో క్లారిటీ వచ్చింది. నటుడు తనికెళ్ళ భరణి ఆసక్తికర కామెంట్స్ చేశారు
వినోదయ సితం రీమేక్ అనివార్యమే. అయితే అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. గత ఏడాది రహస్యంగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తి చేశారని వార్తలు వచ్చాయి. ఇక 2023 జనవరి చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందనే ప్రచారం జరిగింది అయితే ఆ సూచనలేవీ కనిపించలేదు. తాజాగా నటుడు తనికెళ్ళ భరణి క్లారిటీ ఇచ్చారు. వినోదయ సిత్తం మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మాటల్లో మాటగా చెప్పారు. సార్ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన వినోదయ సితం చిత్రంలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వినోదయ సితం షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పకనే చెప్పారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వినోదయ సితం రీమేక్ లో సాయి ధరమ్ మరో హీరోగా నటిస్తున్నారు. పవన్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ అని చెప్పొచ్చు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వినోదయ సితం స్క్రిప్ట్ కి త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేశారట. పవన్ ఇమేజ్ కి సరిపోయేలా తీర్చిదిద్దారట. కేవలం స్టోరీ లైన్ తీసుకొని సన్నివేశాలు కూడా మార్చేశారని ప్రచారం జరుగుతుంది. వినోదయ సితం రీమేక్ కి పవన్ కేవలం 20-25 రోజులు కేటాయించినట్లు టాలీవుడ్ టాక్.
సాయి ధరమ్ తేజ్ మామయ్యతో కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. కాబట్టి సాయి ధరమ్ కి చాలా ప్రత్యేకం. ఇటీవల అన్ స్టాపబుల్ షోకి పవన్-సాయి ధరమ్ వచ్చారు. చిన్నప్పటి నుండి నా మంచి చెడ్డలు చూసుకుంది మామయ్యే అని సాయి ధరమ్ తేజ్ చెప్పడం విశేషం. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా విరూపాక్ష టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ జరుపుకుంటున్న విరూపాక్ష ప్రోమోలు అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం మీద పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
ఇక పవన్ హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ తో ఒక చిత్రం హరీష్ శంకర్ తో మరొక చిత్రం ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ నుండి రానున్న కాలంలో 4 సినిమాలు విడుదల కానున్నాయి. హరి హర వీరమల్లు ఈ ఏడాది విడుదలయ్యే సూచనలు కలవు.
