Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన `ఎన్టీఆర్‌ 30`.. ఆఫీస్‌ కూడా ప్రారంభం.. షూటింగ్ డిటెయిల్స్

NTR30కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. నేడు(ఆదివారం) ఎన్టీఆర్‌30 సినిమాకి సంబంధించిన ఆఫీస్‌ని ప్రారంభిస్తున్నారు. షూటింగ్‌ డేట్స్ కూడా ఫిక్స్ అయ్యిందట.

finally ntr 30 shooting confirm office opening shooting details
Author
First Published Dec 11, 2022, 9:30 AM IST

ఎన్టీఆర్‌కి సంబంధించి అత్యంత సస్పెన్స్ క్రియేట్‌ చేస్తున్న మూవీ `ఎన్టీఆర్‌30`. సామాజిక స్పృహ కలిగిన దర్శకుడు కొరటాల శివ రూపొందించబోతున్న చిత్రమిది. పాన్‌ ఇండియా సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. యవసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ సినిమాని ప్రకటించి ఏడాదికిపైనే అవుతుంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభమవుతుందనే క్లారిటీ లేదు. 

జూన్‌ నుంచి అదిగో, ఇదిగో అనే వార్తలే వినిపిస్తున్నాయి. జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌, అక్టోబర్, నవంబర్‌, డిసెంబర్ ఇలా నెలలు గడుస్తున్నాయి. సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్లు లేవు. మధ్యలో రెండు సార్లు మ్యూజిక్‌ సిట్టింగ్స్ జరిగాయి. దర్శకుడు కొరటాల సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు. దీంతో ఇక షూటింగ్‌ స్టార్ట్ అయినట్టే అనుకున్నారు. కానీ మళ్లీ ఎప్పటిలాగే మారిపోయింది. 

ఇక ఈ సినిమా ఆశలపై నీళ్లు చల్లుతూ ఎన్టీఆర్‌ శుక్రవారం అమెరికా వెళ్లిపోయారు. ఫ్యామిలీతో కలిసి ఆయన లాంగ్‌ టూర్‌కి వెళ్లారు. దీంతో ఇప్పట్లో ఎన్టీఆర్‌30 షూటింగ్‌ ప్రారంభం కష్టమే అనే అంచనాకి అంతా వచ్చేశారు. తారక్‌ అభిమానులు మరింత నిరాశలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. నేడు(ఆదివారం) ఎన్టీఆర్‌30 సినిమాకి సంబంధించిన ఆఫీస్‌ని ప్రారంభిస్తున్నారట. `యువసుధ ఆర్ట్స్` సంస్థ శ్రీనగర్‌ కాలనీలో ఎన్టీఆర్, కొరటాల సినిమాకి సంబంధించిన ఆఫీస్‌ని ప్రారంభిస్తున్నారట. 

మరోవైపు షూటింగ్‌ ప్రారంభానికి సంబంధించిన అప్‌డేట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎట్టకేలకు ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించాలని డిసైడ్‌ అయ్యారట. ఇది ఎప్పటిలాంటి రూమర్‌ కాదు, ఈ సారి గట్టిగా ఫిక్స్ అయ్యారట. షూటింగ్‌ డేట్‌ని లాక్‌ చేశారట కొరటాల. ఫిబ్రవరి మొదటి వారం నుంచే స్టార్ట్ చేయబోతున్నారట. అందుకే ఆఫీస్‌ని ప్రారంభించనున్నారని టాక్‌. షూటింగ్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ లోపు తారక్‌ తన విహారయాత్రని పూర్తి చేసుకుని వస్తారని సమాచారం. 

బౌండెడ్‌ స్క్రిప్ట్ ని కొరటాల రెడీ చేస్తున్నారట. ఒక్కసారి షూటింగ్‌ స్టార్ట్ చేశాక, మధ్యలో గ్యాప్‌ లేకుండా కంటిన్యూగా షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. అత్యంత వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ కాల్షీట్లు ఆల్మోస్ట్ ఏడాది పాటు వేస్ట్ అయ్యాయి. మిగిలిన హీరోలు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇంతటి పీక్‌ టైమ్‌లో ఏడాది డేట్స్ వేస్ట్ కావడమంటే మాటలు కాదు. ఈ గ్యాప్‌లో  తారక్‌ ఓ సినిమా చేసేవాడు. అంటే ఆయనకు ఓ ఆరవై కోట్ల నష్టం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్‌30ని ఫాస్ట్ గా పూర్తి చేయాలనుకుంటున్నారట. 

ఈసినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అత్యంత మాస్‌ గా సినిమా ఉండబోతుందని, అలాగే వాటర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితే ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. జాన్వీ కపూర్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ లేదు. మృణాల్‌ ఠాకూర్‌ పేరు కూడా చక్కర్లు కొడుతుంది. మరి వీరిలో ఎవరు ఫైనల్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios