పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటిసారి డైరెక్ట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథను ప్రభాస్ తో తెరకెక్కిస్తుండగా, ఆదిపురుష్ అనే టైటిల్ నిర్ణయించారు. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో ప్రభాస్ రామునిగా కనిపించనున్నారు. సినిమా షూటింగ్ మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయనున్నారట. దాదాపు విఎఫ్ఎక్స్ వర్క్ తో పూర్తి చేయనున్న ఈ చిత్రం విజువల్ వండర్ లా ఉండనుంది. 

కాగా ఈ మూవీలో సీత పాత్ర చేయనుంది ఎవరనే విషయంలో చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. రామాయణ గాథలో కీలక పాత్ర సీత కాగా దీని కోసం అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. కీర్తి సురేష్, అనుష్క శర్మ వంటి హీరోయిన్స్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. 

బాలీవుడ్ అండ్ టాలీవుడ్ నుండి అనేక మంది స్టార్ హీరోయిన్స్ ని పరిశీలించిన చిత్ర యూనిట్, కృతి సనన్ ని ఫైనల్ ని చేసినట్లు సమాచారం. ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ గా కృతి సనన్ ని ఎంపిక చేశారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం అని తెలుస్తుంది. 

ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా మూవీలో నటించాల్సి ఉంది. ఆదిపురుష్, నాగ్ అశ్విన్ మూవీ ఏక కాలంలో ప్రభాస్ పూర్తి చేసే అవకాశం కలదు.