సమంత విడాకులను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నీకు విడాకులు అయ్యాయి పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేయవద్దారని ఆమె వాపోయారు.
నాగ చైతన్య-సమంత ఎందుకు విడిపోయారనేది వారికి మాత్రమే తెలిసిన నిజం. నాలుగేళ్లు అన్యోన్య దంపతులుగా ఉన్న ఈ జంట అనూహ్యంగా దూరమయ్యారు. విడాకులు మేటర్ విషయంలో నాగ చైతన్య ఫుల్ సైలెంట్. ఏ రూపంలో కూడా ఆయన స్పందించలేదు. సమంత మాత్రం పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. ఒకటి రెండు ఇంటర్వ్యూలలో సుచాయిగా పైపైన మాట్లాడారు. కారణాలు మాత్రం వెల్లడించలేదు.
తాజాగా సమంత ఆసక్తికర కామెంట్స్ చేశారు. భార్యగా నేను వంద శాతం కరెక్ట్ గా ఉన్నానని చెప్పి మంటలురేపారు.సమంత మాట్లాడుతూ... విడాకులైన కొత్తల్లో పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. దానికి నేను సైన్ చేశాను. బంధువులు, సన్నిహితులు దీన్ని వ్యతిరేకించారు 'ఊ అంటావా మామా' సాంగ్ చేయకని వారించారు. నీకు విడాకులై ఎక్కువ రోజులు కావడం లేదు. నువ్వు ఐటెం నంబర్ చేస్తే జనాల్లో తప్పుగా ప్రొజెక్ట్ అవుతావు. ఆ ఆలోచన మానుకో అన్నారు.
అయితే నేను వినలేదు. వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది వర్క్ అవుట్ కాలేదు. నేను ఏ తప్పు చేయలేదు. అయితే నేను వినలేదు. వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది వర్క్ అవుట్ కాలేదు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు శిక్ష ఎందుకు అనుభవించాలి. నేనేందుకు దాక్కోవాలి... అంటూ సమంత ఘాటు కామెంట్స్ చేశారు.
పుష్ప మూవీలో సమంత రెచ్చిపోయి 'ఊ అంటావా మామా' సాంగ్ చేశారు. షార్ట్ ఫ్రాక్ వేసి హొట్నెస్ కురిపించారు. నాగ చైతన్య మీద కోపంతో సమంత ఆ సాంగ్ చేశారని అప్పట్లో పుకార్లు వినిపించాయి. సమంత లేటెస్ట్ కామెంట్స్ తో పూర్తి స్పష్టత వచ్చింది. ఆ ఐటెం సాంగ్ అంగీకరించాడని నాగ చైతన్య ప్రధాన కారణమని అర్థమవుతుంది. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఈ వ్యాఖ్యలు చేశారు.
