Asianet News TeluguAsianet News Telugu

నేను సింగల్ పేరెంట్ కాదు, భర్తను పరిచయం చేసిన ఇలియానా... ట్రోలర్స్ కు కౌంటర్.

ట్రోలర్స్ మూతికి తాళాలువేయాలి అనుకుంది టాలీవుడ్ హీరోయిన్.. జీరో సైజ్ ఫేమ్ ఇలియానా. అందుకే ఫైనల్ గా తను పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న తన లైఫ్ పార్ట్ నర్ ను పరిచయం చేసింది. 
 

finally Heroine ileana dcruz introduces her boyfriend JMS
Author
First Published Nov 25, 2023, 1:49 PM IST

ఒకప్పుడు ఇలియానా అంటే పడిచచ్చిపోయేవారు జానాలు. ముఖ్యంగా ఆమె జీరో సైజ్ నడుమంటే ఇప్పటికీ క్రేజ్ ఎక్కువ. కాని ఇలియానానే కాస్త బొద్దగా తయారయ్యి.. రూపు రేఖలు మారిపోయింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గి..ఫెయిడ్ అవుట్ అవ్వగానే.. కనిపించకుండా పోయింది. ఇక కొంత కాలానికి ఈ స్టార్ హీరోయిన్ ఇలియానా పెళ్లి మాట చెప్పకుండానే ప్రెగ్నెన్సీ సంగతి చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. అంతే కాదు.. ఆతరువాత పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి పండగ చేసింది. కాని తన పార్ట్నర్ ను మాత్రం పరిచయం చేయలేదు బ్యూటీ. ఇక  తన బాబు పేరుని, ఫేసుని రివీల్ చేసిన ఇలియానా.. బాబు తండ్రి ఎవరు అన్న విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టైన్ చేస్తూనే  వచ్చింది. 

finally Heroine ileana dcruz introduces her boyfriend JMS

ఇక తాజాగా  ఆ సస్పెన్స్ కి తెరదించింది. ట్రోలర్స్ కు భయపడిందా.. ? లేక వీరితో ఎందుకు ఇన్ని మాటలు పడాలి అనుకుందా  తెలియదు కాని.. తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. రీసెంట్ గా ఇలియానా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈక్రమంలోనే ఆమె తన భర్త ఎవరో అందరికి తెలియజేశారు. ఇంతకీ ఇలియానా తో కలిసుంటున్న ఆ వ్యక్తి ఎవరంటే..? పెళ్లాడిన ఆ వ్యక్తి ఎవరు..? గతంలో ‘డేట్ నైట్ అంటూ ఒక వ్యక్తితో ఉన్న ఫోటోలను ఈ భామ షేర్ చేసింది. కాని అప్పుడు మాత్రం అతను ఎవరు అనేది చెప్పలేదు. కాని ఇప్పుడు అతనే తన భర్త అని పరిచయం చేసింది బ్యూటీ. 

నెటిజన్ల నుంచి వస్తున్న రిక్వెస్ట్ లు, ఆమెపై విమర్షలకు సమాధానం ఇచ్చింది.  మీ సింగల్ పేరెంటింగ్ ఎలా ఉంది..? అని ఒక నెటిజెన్ వేసిన ప్రశ్నకు  బదులిస్తూ.. తాను సింగల్ పేరెంట్ కాదని తెలియజేస్తూ తన కొడుకుకి తండ్రి ఎవరు అన్నది తెలియజేశారు. దీంతో ఇలియానా భర్త ఎవరు అన్న ప్రశ్నలకు  సమాధానం దొరికింది. 

finally Heroine ileana dcruz introduces her boyfriend JMS

ఇక ఇదే ఇంటరాక్షన్ మాట్లాడుతూ.. త్వరలోనే మళ్ళీ సినిమాలోకి తిరిగి వస్తానని, ప్రస్తుతం అమ్మగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాధానాలతో ఆమె అభిమానులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇలియానా పెళ్లాడిన ఈ వ్యక్తి ఎవరు..? అతను ఏం చేస్తారు..? అనేది మరో ప్రశ్నగా మారింది. కాగా ఇలియానా ఈ ఏడాది మే నెలలో తన ప్రెగ్నెన్సీ అందరికి తెలియజేశారు. ఆగస్టు 1న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి అమ్మగా ప్రమోషన్ అందుకున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios