యూట్యూబ్ మీడియా కథనాలపై హీరో విక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరాధార కథనాలపై పరోక్షంగా సటైర్స్ వేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న విక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హీరో విక్రమ్ గుండెపోటుకు గురయ్యారన్న వార్తలు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేశాయి. విక్రమ్ అనారోగ్యంతో కావేరి హాస్పిటల్ జాయిన్ అయ్యారు. దీంతో అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆయనకు గుండెపోటుతో బాధపడుతున్నారని కథనాలు వెలివడ్డాయి. ఈ వార్తలను ఆసుపత్రి వర్గాలతో పాటు విక్రమ్ కుమారుడు ధ్రువ్ ఖండించారు. ఇక కోలుకున్న విక్రమ్ మీడియా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రసారాలు థంబ్ నైల్స్ పై సటైర్స్ వేశారు.

ఆయన మాట్లాడుతూ... కొందరు నా ఆరోగ్యంపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. అనారోగ్యంతో బెడ్ పై ఉన్న వ్యక్తుల ఫోటోలకు నా ముఖం పెట్టి మార్ఫింగ్ చేశారు. ఇవ్వన్నీ నాకు అనుభవమే. కానీ నా మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారు, అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో విక్రమ్ చాలా ఎనర్జెటిక్ గా కనిపించారు. ఇక విక్రమ్ ఆరోగ్యంపై ఉన్న అనుమానాలు తీరిపోయాయి.

ఇక విక్రమ్ లేటెస్ట్ మూవీ కోబ్రా ఆగష్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్ర దర్శకుడు కాగా కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో విక్రమ్ పదికి పైగా భిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. అలాగే విక్రమ్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీలో ప్రధాన ఆదిత్య కారికాలన్ పాత్ర చేశారు. సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ విడుదల కానుంది.