ఇక నిన్న ఎపిసోడ్ లో అరియానా-అభిజిత్‌ల మధ్య ఫుడ్ విషయంలో గొడవ మొదలైంది. నీవలన ప్రతి టాస్క్ లో ఫుడ్ వలన ఇబ్బంది అవుతుందని అరియనా అభిజిత్ పై ఆరోపణలు చేసింది. ఏది ఒప్పుకొని అభిజిత్ వాగ్వాదానికి దిగాడు.  బిగ్ బాస్ టాస్క్ లో నేను చేయాల్సిన పనే ఆహారం తయారు చేయడం  ముందు తెలుసుకో అన్నాడు.మనసులో  ఉన్నది కాదు బుర్రలో విషయాన్ని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు

అరియానా తనకు పప్పుతో పాటు ఆమ్లెట్ కూడా కావాలని అనడంతో మళ్లీ గొడవ రేగింది. అమ్మా రాజశేఖర్ తిరిగి ధాన్యం ఇచ్చి రైస్‌తో పాటు ఆమ్లెట్ అడిగారు. దానికి రైస్ తో పాటు ఆమ్లెట్ ఇవ్వడం కుదరదని అభిజిత్ ఖరాకండిగా చెప్పాడు.  ఈ విషయం మాస్టర్ కోపానికి కారణం అయ్యింది. నీ ఫుడ్ నీ దగ్గరే ఉంచుకో అంటూ మోనాల్ చేతిలో ఫుడ్ చేతితో కొట్టడంతో  ప్లేట్ లో ఉన్న భోజనం కొంత క్రింద పడింది. 

 ఇక ఊరి పెద్దగా ఉన్న సొహైల్ పల్లె ప్రజల ఆకలి బాధల తరుపున హోటల్ యజమానితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. భోజనం రేట్లు తగ్గించాలని అడిగారు. దానికి అభిజిత్ కుదరదు అని గట్టిగా చెప్పేశాడు. హారికకు బిగ్ బాస్ ఇచ్చిన  సీక్రెట్ టాస్క్‌లో భాగంగా,  అవినాష్‌కి కోపంగొడవకు దిగింది. అయితే నన్ను బ్యాడ్ చేయాలని వీళ్లు ఫిక్స్ అయ్యారు అని అవినాష్ కి కహారిక  సీక్రెట్ టాస్క్‌ని కనిపెట్టేశాడు.

అయితే హారిక.. తన గేమ్ ప్లాన్‌ని వర్కౌట్ చేస్తూ పాన్ షాప్‌ని ద్వంసం చేస్తుండగా మధ్యలో అఖిల్ వెళ్లి షాప్‌ని ధ్వంసంచేయడంతో గొడవ పెద్దదైంది. మధ్యలో ఊరి పెద్ద మనిషి వెళ్లి చెప్పినా ఎవరూ వినలేదు. ఒకర్నొకరు తోసుకుంటూ గొడవకు దిగారు. దీంతో అవినాష్ సహనం కోల్పోయి తన షాప్‌ని తానే ధ్వంసం చేసుకున్నాడు. పాన్ డబ్బాను విసిరి కొట్టడంతో అది వెళ్లి మెహబూబ్‌కి తగిలింది. ఇంత గొడవ జరుగుతున్నా ఊరి పెద్ద మనిషి వాళ్లని కంట్రోల్ చేయడం లేదని  సొహైల్‌ పై మెహబూబ్ కోప్పడడం కొసమెరుపు. 

పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ కంప్లీట్ అయ్యే సమయానికి కెప్టెన్ పోటీదారులుగా ముగ్గురు మిగిలారు. సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన హారికతో పాటు అమ్మా రాజశేఖర్, అరియానాలు కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. మాస్టర్ గత వారం సేవ్ కావడంతో అతను డైరెక్ట్‌గా ఈవారం కెప్టెన్ పోటీదారుడు అయ్యాడు. ఇక అరియానా హౌస్‌కి కెప్టెన్‌గా ఉండటంతో గత వారం రోజులుగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ల పేరు చెప్పాలని వాళ్లే కెప్టెన్ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ చెప్పడంతో తన పేరు చెప్పుకుని కెప్టెన్ పోటీలో రెండో వారం కూడా నిలిచింది అరియానా.

ఐతే ఈ వారం హౌస్ కెప్టెన్ గా హారికను బిగ్ బాస్ ఎంపిక చేశారు. ఈ విషయం ప్రకటించగానే హారిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంటి ఆవరణలో సందడి చేస్తూ కెప్టెన్ అయిన ఆనందాన్ని హరికి ఎంజాయ్ చేసింది. మొదటిసారి ఇంటి కెప్టెన్ అయిన హారిక ఆ సంతోషాన్ని వ్యక్తం చేసింది.