కనీసం బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అయినా అమ్మాయి గెలిస్తే చూడాలన్న అమ్మాయిల కోరిక నెరవేరలేదు. ఫైనల్ కి చేరిన ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ అరియనా, హారిక ఎలిమినేటై బయటికి వచ్చేశారు. అతి తక్కువ ఓట్లు పొందిన కారణంగా వీరిద్దనీ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఐదుగురు సభ్యులలో అందరికంటే హరికకు తక్కువ ఓట్లు రావడం జరిగింది. దీనితో మొదటగా ఆమె ఎలిమినేట్ కాగా హౌస్ నుండి బయటికి పంపివేశారు. 

 
ఇక హౌస్లో మిగిలిన టాప్ ఫోర్ నుండి అరియానా నిష్క్రమించారు. అయితే టాప్ 4 లో ఉన్న సభ్యులకు నాగార్జున మంచి ఆఫర్ ఇచ్చాడు. ఎవరైనా ఎలిమినేట్ అవుతామని భావిస్తే... పది లక్షలు తీసుకొని ఎలిమినేషన్ ప్రకటించక ముందే బయటికి వెళ్లిపోవచ్చు అన్నారు. పది లక్షలు చాలా పెద్ద అమౌంట్, గెలిచే అవకాశం 25శాతం మాత్రమే ఉందని హీరోయిన్ ప్రణీత నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 
 
అయితే నలుగురు కంటెస్టెంట్స్ ఈ ఆఫర్ స్వీకరించలేదు. ఆ తరువాత హీరోయిన్ లక్ష్మీ రాయ్ వచ్చి, అరియానా ఎలిమినేషన్ ని ఖరారు చేశారు. దానితో అరియనా పదిలక్షలు కోల్పోవడంతో పాటు, ఎలిమినేటై మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇక టైటిల్ కోసం హౌస్ లో అభిజీత్, సోహైల్ మరియు అఖిల్ పోటీపడుతున్నారు.