అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు సినిమాలు చేశాడు. కానీ ఆయనకి సరైన హిట్ మాత్రం దక్కలేదు. 'హలో' సినిమా ఓకే అనిపించినా.. హిట్ టాక్ రాలేదు. 'మిస్టర్ మజ్ను' కూడా మెప్పించలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో డైలమాలో పడిపోయాడు అఖిల్.

కొత్త దర్శకులతో పని చేయాలా..? లేక అనుభవం ఉన్న దర్శకులను ఎన్నుకోవాలా..? అనే విషయంలో ఏదీ తేల్చుకోలేక ఫైనల్ గా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాను గీతాఆర్ట్స్ సెట్ చేసింది.

ఈ ప్రాజెక్ట్ ఓకే అయినప్పటికీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో చాలా మందిలో సందేహాలు కలిగాయి. ఫైనల్ గా ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం 
హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. అఖిల్ పైనే కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సివుంది. కొన్ని టైటిల్స్ ని కూడా అనుకుంటున్నారు. 

అయితే ఏదీ ఫైనల్ కాలేదు. మరో పదిరోజుల పాటు హైదరాబాద్ లోనే షూటింగ్ నిర్వహిస్తారు. రెండో షెడ్యూల్ లో హీరోయిన్ ఎంట్రీ ఉండబోతుంది.  అప్పటినుండి నిర్విరామంగా షూటింగ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.