మరో మూడు వారాలలో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇంటిలో ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ఒకరు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం బిగ్ బాస్ కల్పించారు. రేస్ టు ఫినాలే పేరుతో బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లలో గెలిచినవారు ఫినాలే మెడల్ గెలుపొంది, ఫైనల్ కి చేరవచ్చని చెప్పారు. 

దీనిలో భాగంగా మొదటి టాస్క్ గా గార్డెన్ ఏరియాలో ఉంచిన ఆవు నుండి పాలు సేకరించే టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్ లో ఎక్కువ పాలు సేకరించి అఖిల్, సోహైల్, అభిజిత్ మరియు హారిక రెండవ దశకు వెళ్లారు. ఇక రెండవ దశలో నిర్ణీత సమయంలో పైనుండి పడే పూలు సేకరించాలని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో ఎక్కువ పూలు సేకరించి అఖిల్ మరియు సోహైల్ మూడవ దశకు చేరుకున్నారు. 

వీరిద్దరిలో ఒకరు నేరుగా ఫైనల్ కి చేరే అవకాశం దక్కించుకోనున్నారు. హౌస్ లో మిత్రులుగా ఉన్న అఖిల్ మరియు సోహైల్ ఫినాలే టికెట్ కోసం పోటీ పడనున్నారు. మూడవ టాస్క్ గా గార్డెన్ ఏరియాలో ఉన్న ఉయ్యాలలో ఇద్దరు సభ్యులు కూర్చోవాలని, ఎవరైతే ఎక్కువ సమయం కూర్చుంటారో వారు నేరుగా ఫైనల్ కి చేరుతారని బిగ్ బాస్ చెప్పారు. కాబట్టి రేపటి ఎపిసోడ్ లో అఖిల్, సోహైల్ లో ఎవరు ఫైనల్ కి వెళతారో తేలిపోనుంది.